ఆంధ్రరాజులు ఆదరించిన కళలు
శాతవాహన తెలుగు చక్రవర్తులు
'
- ఆంధ్ర శబ్దం:
ఈనాటివరకు జరిగిన పరిశోధనల ఫలితంగా ఆంధ్రుల చరిత్ర ఒక వరుస క్రమంలో తెలుస్తూ వుంది. అనేక భూగర్భ పరిశోధనల ద్వారా ఎన్నో క్రొత్త విషయాలు విశదమౌతున్నాయి. క్రీ.పూ. 550 నుండి బౌద్ధులు ఆంధ్ర దేశం మీదుగా సింహళానికి ప్రయాణాలు చేసినట్లూ, అందుకు సంబందించిన గాథలు బౌద్ధ గ్రందాలలో వున్నట్లూ తెలుస్తూ వుంది. ఆంధ్ర అనే పదం అనేక ప్రాచీన గ్రంధాలలో ఉదహ్రింప బడి వున్నది.
భరతుడు నాట్యశాస్త్రంలో ముఖ్యమైన పదకొండు జాతి రాగాలలో ఆంద్రి ( నేటి రాగం) కూడ ఒక జాతి రాగమని పేర్కొన్నాడు ప్రాచీన గ్రంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ప్రప్రథమంగా ఆంధ్ర శబ్ధం ఉపాయోగ పరచ బడడమే గాక క్రీ.పూ. వెయ్యి సంవత్సరాల ముందుగానే రచించి బడిన భారత, రామాయణ గ్రంధాలలో కూడ ఆంథ్రుల ప్రశంస వుంది. ఈ నాటికి సుమారు నాలుగు వేల సంవత్సరాల నుండీ ఆంధ్ర జాతి ఒక ప్రత్యేక జాతిగా వినిపిస్తున్నదని చెప్పవచ్చు.
- హాలుడూ, కళా పోషణా:
ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన రాజులలో శాతవాహన తెలుగు చక్రవర్తులు మొదటి వారు. వీరినే శాతవాహనులని, శాతకర్ణి రాజులని కూడ వర్ణించారు. క్రీ. పూ. 220 నుండి క్రీ.శ. 218 వరకూ అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల వరకూ 30 మంది శాతవాహన రాజులు ప్రతిష్టాన పురాన్ని రాజధానిగా చేసుకుని హైదరాబాదు సంస్థానంతో సహా కృష్ణా గోదావరి మండలం వరకు వ్వాపించి వున్న ప్రాంతాన్ని పాలించారు. ఆంధ్ర శాతవాహన రాజులలో 14 వ రాజైన హాలుడు ప్రతిష్ఠానపురం