పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలో నివసిస్తూవున్న చెంచులు, కోయలు, ఖాండులు, సవరలు, పండాలు మొదలైన కొండ జాతుల వారి నృత్యాలు మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంటాయి. వీరికీ కళ ఎలా అబ్బిందా అనిపిస్తుంది. ఈ నాటికీ ఆ ప్రాంతాలలో నివశిస్తున్న కొండ జాతుల వారందరూ వారి వారి నృత్యాలను పోషించుకుంటున్నారు.

ఈ విధంగా ఆనాడు దేవుణ్ణి గూర్చీ, దేవతలగూర్చీ ప్రజలలో ప్రచారం జరిపే వారు రాను రాను లౌకిక విహారార్థం శ్రీ మంతుల ఇండ్లలోను, రాజ మందిరాలలోను, వారి తృప్తి కొరకు మాత్రమే నాటకాలు వ్రాయటం, చిత్రాలు గీయటం, నృత్యం చేయటం, కవిత్యం వ్రాయటంతో నాటకాది లలిత కళలన్నీ ప్రజలనుండి దూరమయ్యాయి. ఎప్పుడైతే జమీందారి, శ్రీమంతుల యుగం వచ్చిందో అప్పుడు ప్రజలను దోచుకోవడం మెదలు పెట్టారు. ప్రజలు అనేక బాధలకు గురికావడం వల్ల కళలకు దూరమయ్యారు. కళలన్నీ రాజుల కొరకూ, వారి భోగభాగ్యాల కొరకూ అంకితమై పోయాయి.

శ్రీమంతుల పోషణ:

ఆనాడు దేవకార్యాలన్నీ శ్రీమంతులే చేయిస్తూ వుండేవారు. అందువల్ల ఈ నాట్యాచార్యులూ, గాయకులూ, కవులూ, చిత్రకారులూ అందరూ రాజమందిరాలకే ఆహ్వానింపబడ్డారు. అందువల్ల సామాన్య ప్రజలలో నానాటికి కళ దూరమై పోయింది. ప్రజల జీవితం దుర్బర మైపోయింది. అనందోత్సవాలు, దూరమైపోయాయి. ఇందువల్ల సామాన్య ప్రజలు రాజ మందిరాలకు పోయే అవకాశం లేనందున పూర్తిగా ఆ ఉత్సవాలకు ఆ ప్రదర్శనలకు దూర మయ్యారు. రాను రాను ఆ కార్యక్రమాల్లో శ్రీమంతులకూ, మధ్యతరగతి ప్రజలకూ, విద్యావంతులకూ, పండితులకూ మాత్రమే స్థానం వుండేది. పేద ప్రజలకు అంటు దోషాలు అంట గట్టి, దేవస్థానాల్లో ప్రవేశం లేకుండా స్వార్థ పరులు కళలను దోచుకున్నారు.

ఒకనాడు జీవితానందం కొరకు వృద్ధి పొందాయి. ఒకనాడు జీవితంలో ఆనందం లేక కేవలం కష్టాలను మరచి పోవడానికి తప్పత్రాగి ఆ మత్తులో ఆటలాడారు, చిందులు త్రొక్కారు. పాటలు పాడారు. మొత్తంమీద నాట్యకళ, దేవకార్యాల నుండి, మోటు

చిందుల నుండి, పురాణ కథల నుండి, భజన మేళాలనుండి వృద్ధి పొందిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.