పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/452

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తాలేలిల్లియ్యల్లో:

తాలేలిల్లియ్యలో, శివ తాలే లిల్లియ్యలో అనే పాట ఆంధ్రదేశంలో డప్పుల వాయిద్యం ద్వారా చాల ప్రచారం పొందిన పాట. హరిశ్చంద్ర నాటకంలో వీర బాహుడు కల్లు త్రాగి నృత్యం చేస్తూ ఈ పాట ద్వారానే వేదాంతాన్ని బోధిస్తాడు.

తాలే లిల్లియలో, శివ తాలేలిల్లియ్యలో
కుల మేలాగున్నది, వినుమయ్యలో
మూలము గోచర్మ - మైదుకీళ్ళు గల
తోలు బొమ్మలట - ఈ జగము

అంతా, తాలేలిల్లియ్యలో, కులమేలా
ఐదైదుల ఇరవైఐదు తత్వముల
మనుషులు పుట్టిరి
కులమేలా గున్నది. ॥తాలే ॥

దేవదాసి యను వూర్వసి గర్భము
సుద్భవించిన - వశిష్ట కులమూ
కులమేలా గున్నది . ॥తాలే ॥

దొరలు పెద్దీంటోణ్ణి - తొలగి పోనిండయ్య దొరలు
కాసంత కల్లేసి - కాశీకి పోతాను. ॥తాలే ॥

డప్పుల వాయిద్యాన్ని ముఖ్యంగా జాతర్ల సందర్భాలలోనూ, అమ్మవారి వుత్సవాలలోనూ వీరభద్ర విన్యాసాలలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకేసారి నాలుగు డప్పులు వాయిస్తూ వుంటే ఆ గంభీర నాదం ప్రళయంగా వుంటుంది. ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ వాయిద్యాన్ని మాదిగలనే ఆది ఆంధ్రులు ఎక్కువగా ఆరాధిస్తారు.

డప్పు వాయిద్యంలో నిపుణత్వం:

ఆంధ్ర దేశంలో డప్పు వాయిద్యంలో నిపుణత్వాన్ని ఆయా రీతుల్లో అనేక మంది చూపించిన వారున్నారు. ఈ డప్పుల వాయిద్యాన్ని ఆ యా సమయాలను బట్టి