కూడ వాయిస్తూ వుంట్ఘారు. పెండ్లి వూరేగింపులో వాయించే వాయిద్యానికీ, దేవుళ్ళ లుత్సవాల్లో వాయించే వాయిద్యానికీ ఎంతో వ్యత్యాసముంటుంది. అలాగే మనుషులు చనిపోయి నప్పుడు వాయించే వాయిద్యం మరో రకంగా వుంటుంది. ఆయా సంఘటనలకు అనుగుణంగా ఈ వాయిద్యాన్ని మలుస్తారు.
- నిజామాబాదు జిల్లాలో:
నిజామాబాదు జిల్లాలో దాదాపు అన్ని గ్రామాలలోనూ డప్పు వాయిద్యానికి అధిక ప్రాదాన్యం యిస్తారు. పెళ్ళిళ్ళ సందర్భంలో ఎన్ని ఎక్కువ డప్పులు ఉపయోగిస్తే ఆ పెళ్ళి వూరేగింపును గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. పెళ్ళి ఊరేగింపుల్లో, డప్పుల వారు రకరకాల విన్యాసాలను చేస్తూ వుంటారు. నేలపైన ఒక డప్పును బోర్లించి, దానిపైన చిల్లర డబ్బులు వుంచుతారు వాద్య కారుడు మరో డప్పుతో వాయిస్తే, ఆ శబ్ద కంపనానికి డప్పు మీదున్న చిల్లర
డబ్బులన్నీ నీల మీద పడి పోతాయి. అలాగే నేలపై కరెన్సీ నోట్లను వేసి, లయ తప్పకుండా డప్పును వాయిస్తూనే నేలపై వుంచిన కరెన్సీ నోట్లను చేతితో ముట్టకుండా కంటి రెప్పలతో అందుకుంటారు.