పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/450

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అలసి పోతాడు. ఇంతలో కృష్ణునిపై కంసుడు ప్రయోగించిన అరిష్ట అర్భకుడు అనే రాక్షసుడు వస్తున్నాడని తెలుసుకుని నృత్యాన్ని ఆపేస్తారు.

ఈ నాటకంలో ఆటపాటతో పాటు నృత్యం కూడ వుంది. వీటికి తోడు డప్పుల నృత్యం కూడ చోటు చేసుకుంది. ఇది పక్కా పల్లెటూరి నృత్యమంటారు. ఇతర భాస నాటకాల్లో ఇలాంటి జానపద కళను ప్రవేశపెట్ట లేదంటారు. ఓగేటి అచ్యుతరామ శాస్త్రి గారు నాట్య కళ జానపద కళల ప్రత్యేక సంచికలో ప్రాచీన జానపద కళల ప్రస్తావనలో అంటే డప్పు నృత్యం ఈ నాటిదే కాదు, ఆనాటిదే అని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ.

డప్పుల కోలాట నృత్యం :

ఈ డప్పుల నృత్యాన్నే తప్పెట్ల వాయిద్య మంటారు. దీనినే రాయల సీమ ప్రాంతాల్లో కనక తప్పెట్లంటారు. ఈ వాయిద్యాన్ని మాదిగ కులస్థులు ఎక్కువగా వాయిస్తూ వుంటారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈ నాటికీ ప్రతి పల్లె లోనూ ఒక కార్యక్రమాన్ని గాని, ఒక విశేషాన్ని గాని ప్రజలందరికీ తెలియ జెప్పాలంటే ఒక్క డప్పుతో వూరంతా ఏటువంటి విషయాన్నైనా చాటిస్తారు. వివాహలకు, అమ్మవారి జాతర్లకూ, వీరుళ్ళ పూజలకూ ఈ