పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/449

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

దడదడ లాడించే డప్పుల నృత్యం


భాసుని నాటకంలో డప్పు నృత్యం:

బాలచరితం భాసుని నాటకం. దీనిలోని ప్రధాన ఇతి వృత్తం, "శ్రీకృష్ణ బాల క్రీడలు" తృతీయాంకం మొదటి రంగం ప్రవేశంలో గ్రామీణుల డప్పుల నృత్యాన్ని ప్రవేశ పెట్టాడు భాసుడు. ఇక్కడ కృష్ణుడు వృద్ధ గోపాలుడుగా ప్రత్యక్షమవుతాడు. గొల్ల పడుచులు "ఘోష సుందరి, వనమాలి, చంద్రలేఖ, మృగాక్షి" మొదలైన వారు నృత్యం చేయటానికి ఒక చోటకు చేరుతారు.

అప్పుడు అక్కడకు వచ్చిన దామోదరుడు ఆడ పడుచుల అందాలకు అచ్చెరువంది వారితో చేరి నృత్యం చేదామంటాడు. వాళ్ళు సరేనంటారు.

వాళ్ళ సంభాషణ ఇలా కొనసాగుతుంది. దామోదరు డంటాడు. ఘోషవాణీ పల్లె వాసులకు అనుకూలమైన "హల్లీసక" మనే నృత్యం చేదాం అంటాడు.

అందుకు సంకర్షణుడు "అయితే డప్పులు మోగిద్దాం" అంటాడు. అప్పుడు వృద్ధ గోపాలుడు కృష్ణునితో మీరు నృత్యం చేస్తూ వుంటే నేనో? అంటాడు. నువ్వు చూస్తూ కూర్చో అంటాడు కృష్ణుడు. వాళ్ళు నృత్యం చేస్తూ వుంటారు. మంచి రక్తిలో వుండగా వృద్ధ గోపాలుడు ఉత్సాహం పట్టలేక డప్పు మ్రోతతో నృత్యం అద్భుతంగా వుంది నేనూ నృత్యం చేస్తానంటూ వాళ్ళతో కొంత సేపు నృత్యం చేసి