Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బతకమ్మ, బతకమ్మ, ఉయ్యాలో


పూర్వం చోళ దేశంలో ధర్మాంగదుడనే రాజుకి ఎన్నో నోముల అనంతరం తన అర్థాంగికి శ్రీలక్ష్మి జన్మించగా ఆమెకు ఎన్నో గండాలు వచ్చినప్పటికి బ్రతికి నందువల్ల "బతుకమ్మ" అని పేరు పెట్టటం జరిగిందని జన శృతి వుందని జన ప్రియగారు ఒక వ్వాసంలో తెలియజేశారు.

ఈ నాటికీ తెలంగాణా ప్రాంతాల్లో బతకమ్మ అని వారి వారి బిడ్డలకు పేర్లు పెట్టుకోవడం కనబడుతుంది. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, లక్ష్మీ పార్వతుల పూజలు చేయడమే, కన్నె పడుచులు నోచుకోవడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ బతుకమ్మ పండుగ కరీంనగర్, మహబూబు నగర్, వరంగల్ జిల్లాలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది.

ఎక్కడా లేక పోయినా!:

ఆంధ్రదేశంలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా ఒక్క తెలంగాణాలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొందిన బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది.

దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం చద్దుల బతకమ్మ అంటారు.

బతకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో విండిన చెరువులు, తొణికస లాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది.