పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/428

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఅలాగే ఒక ఖాళీ డబ్బాను ఒక కుర్రవాడి కాళ్ళ మధ్యను పెట్టి, కుర్రవాడి పిర్రమీద ఒక దెబ్బ కొట్టి డబ్బాలోకి రూపాయలు కురుపిస్తాడు.

చేతుల్లో వున్న రూపాయల్ని మాయం చేయడం, ఒట్టి చేతుల నుండి రూపాయల్ని ప్రత్యక్షం చేయడం చేతి కున్న వుంగరాన్ని మాయం చేసి, ఆ వుంగరాన్ని ప్రేక్షకుల్లో ఒకరి చేతి నుండి లాక్కోవడం, ఇలా ఎన్నెన్నో వింతలు కన్ను మూసి కన్ను తెరిచే లోగా, అద్భుతాలను ప్రదర్శించి, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

వీరు ఉరుదు భాషను ఉచ్ఛరిస్తూనే తెలుగు మాట్లాడుతూ, మధ్య మధ్య హాస్య చలోక్తులను విసురుతూ, ప్రేక్షకులను మాయలో ముంచి, ఇదంతా వారి గురువు వుస్తాద్ మహిమంటూ, చివరగా గాలికీ, ధూళికీ, ప్రేతాలకూ, పిశాచాలకూ మందుగా తాయిత్తులను అమ్ముతారు. వాటిని జనం విరగబడి కొంటారు వాటిలో ఏదో మహత్మ్యముందని.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈ మోళీ విద్యలు ఈ నాడు ఎక్కడా మచ్చుకు కూడ వున్నట్లు లేదు. కాని ఒక నాటిది అద్భుతమిన అతీంద్రియ శక్తులను ప్రదర్శించే కళగానూ, ప్రజలను ఆనందింప చేసే ఆసక్తికరమైన కళారూపంగానూ రూపొందింది.