పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/426

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేస్తారు. ప్రజలు వీరు చేసే హస్త లాఘవ తాంత్రిక విద్యలకు అచ్చెరు వొందేవారు.

ముఖ్యంగా వీరు నూరు గజాల దూరంలో , అటూ ఇటూ రెండు పక్షాలుగా చేరుతారు. ఇరువురూ చిన్న గుడారాలను నిర్మిస్తారు. ఆ గుడారంలో ఒక గొయ్యి తీస్తారు. ఆ గోతిలో పసుపు కుంకుమ కలిపిన రంగు నీళ్ళు వుంచుతారు. అందులో ఒక కొబ్బరికాయ వుంచుతారు. మోడీ ప్రారంభమైన వెంటనే పాముల బుర్ర వూదుతూ వచ్చి గుడారానికి ముందున్న గీతను దాటి, గుడారపు గుంటలో నున్న కొబ్బరి కాయను తీసుకు వెళ్ళాలి. ఇలా తీసుకు వెళ్ళటానికి ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు వచ్చే వ్వక్తిని గుడారానికి దగ్గర వరకూ రానీయ కుండా మంత్రాలను వల్లిస్తూ మంత్రించిన కందులను అతని మీద చల్లుతాడు. అవి కందిరీగల్లాగ కుట్టినట్లు బాధపడుతూ, అడుగు ముందుకు వేయలేడు. అప్పుడు అవతలి వ్వక్తి మరో మంత్రం చదివి, ఆ కట్టును విప్పుతాడు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఇలా ఒకరి కొకరు మంత్ర ప్రయోగాలు చేసి ఎవరి మంత్ర శక్తి ఎక్కువైతే వారు చివరికి ఎదుటి వారి గుడారపు గుంటలో దిగి కొబ్బరి కాయ తీసి జన సమూహం మధ్యలో పగుల కొట్టి ఎదుటి వారిని జయించి నట్లు అట్టహాసం చేస్తాడు.