పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/425

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నృత్యం చేస్తాడు. పాము కరిచినట్లూ, విషం తలకెక్కి నట్లూ తూలుతూ, త్రుళ్ళుతూ సొక్కి పోతూ, తనమంత్ర విద్యను ప్రవేశపెట్టి, క్రమేపీ కోలుకుని బ్రతికానన్నంత సంతోషంతో ఆనంద నృత్యం చేసి ప్రజలను తృప్తిపర్చి దండుకుంటారు.

నిజంగా పాముల వాని నృత్యం నేత్ర పర్వంగానే వుంటుంది. సహజంగా చాల మంది స్వయంగా త్రాచు పాముల్ని చూడలేరు. అటువంటి తెల్ల త్రాచుల్నీ, కోడె త్రాచుల్నీ, గోధుమ వన్నె త్రాచుల్నీ కష్టపడి పట్టుకొచ్చి తమ జీవనోపాధి కోసం వృత్తిని సాగిస్తారు. వీరు ఒక వూరినుంచి మరో వూరికి సంచారం చేస్తూ పాముల్ని పడుతూ, పాము కాటుకు గురైన వాళ్ళకు మందులిస్తూ జీవిత యాత్ర సాగిస్తారు.

పోటీల మోడీలు:

ఈ రోజుల్లో మోడీలంటే ఎవరికీ తెలియదు. కానీ ఏభై సంవత్సరాల క్రితం ఈ మోడీలు అధికంగా పల్లె ప్రాంతాల్లో జరిగేవి.

పలానా గ్రామంలో ఫలానా అరోజున మోడి అని తెలిస్తే సరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వచ్చి పడేవారు. అది ఒక పెద్ద ఉత్సవం గానూ ఇరుపక్షాల మధ్యా జయాపజయాల పోరాటంగానూ సాగేది.

ఒక్కొక్క సారి గ్రామ జాతర్ల సమయం లోనూ, సంతల సమయాల్లోనూ కూడ ఈ ప్రదర్శనాలు జనారంజకంగా జరిగేవి.

ఈ మోడీలు అరవై సంవత్సరాల క్రితం పాముల నాడించే పాముల వారి ముఠాల మధ్యనే జరిగేవి. ఇవి చాల పౌరుష వంతంగా జరిగేవి. చావు బ్రతుకుల పోరాటంగా పోరాడే వారు. అయితె ఈ మోడీలను ఇతర కులస్థు లైన పెద్దేటు గొల్లలు మొదలైన వారు చేసే వారని ప్రతీతి.

ఈ మోడీలకు సంబంధించిన వారు ఇంద్రజాలం, హస్త లాఘవ విద్యలలో మంత్ర తంత్రాలలో ఆరి తేరినవారై వుండేవారు. ఇవి పూరి మధ్యనో, లేక విశాల మైన మైదాన ప్రదేశంలోనో ప్రజల మధ్యన జరిగేవి.

మంత్ర ప్రయోగాలు:

ఇరు పక్షాలవారూ, ఒకరి విద్యలను మరొకరిపై ప్రయోగిస్తూ, ఒకరిని మించి మరొకరు అస్త్రాలను ఎక్కు పెట్టినట్లు ఒకర్ని మించి మరొకరు మంత్ర ప్రయోగాలు