పాములాటలూ, మోడీలూ
నాటి నుంచీ ఈ నాటికీ పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో పామును బుట్టలో పెట్టుకుని నాగస్వరం వాయిస్తూ ప్రతి ఇంటికీ తిరిగి, పాముల వాళ్ళు యాచిస్తూ వుండటం తెలిసిందే.
పాముల్ని పట్టటం, వాటిని ఆడించటం ప్రజలను యాచించటం, అలా జీవనం గడపడం పాముల వారి వృత్తి. ఇది ఒక తెగ, వీరు దేశంలో చాల చోట్ల కనిపిస్తారు. వీరు లిపి లేని భాషను కూడా మాట్లాడుతారు.
ఎక్కడెక్కడో పుట్టల్లో వున్న త్రాచు పాముల్ని పసికట్టి, ఉపాయంగా పట్టి వాటి పళ్ళను పీకి విషాన్ని పిండి, మూతి కుట్టి దానికి గుడ్డూ పాలు పోసి, మచ్చిక చేసి బుట్టలో పెట్టి నాగస్వరాన్ని ఊదుతూ వివిధ స్థాయిల్లో దానితో విన్యాసం చేయిస్తూ నయనానందకరంగా ఆడిస్తూ, పిల్లల్నీ, పెద్దల్నీ ఆశ్చర్య చికితుల్ని చేస్తూ తద్వారా జీవనోపాధిని సాగిస్తూ వుంటారు.
పాముల వాడు బుట్టలో నున్న పాము విన్యాసం చేసి నట్లే తాను ఆ వాయిద్యానికి అనుగుణంగా మెలికలు తిరిగి పోతూ నృత్యం చేస్తూ అటు పామూ, ఇటు పాముల వాడు, ఇరువురి నృత్యంతో ప్రేక్షకులు ముద్థులై పోయి అక్కడికక్కడే ఎవరికి తోచింది వారు వారికి ముట్ట చెపుతూ వుంటారు.
ఇది ఒకప్పుడు పల్లెల్లో జానపద కళలతో పాటు ఈ పాములాట కూడ వినోద ప్రదర్శనంగా వుండేది.
- రెండు త్రాచుల విన్యాసం:
ఒక్కొక్కసారి రెండు కోడె త్రాచుల్ని ఎదురెదురుగా వుంచి, తాను వాయిద్యంతో ఆ రెంటినీ రెచ్చ గొట్టి లబ్జుగా పాముల బూర ఊదుతూ తాను నేత్ర పర్వంగా