Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీనపు పాములాటలు


నేటి పాములాటలన్నీ చూస్తూనే వున్నాం. అయితే "ముద్రా రాక్షసంలో" "ద్వితీయాంకం" లో ప్రవేశించే పాముల వారిని గురించి ఓగేటి అచ్యుత రామ శాస్త్రి గారు "నాట్యకళ" "జాన పద కళల ప్రత్యేక సంచికలో" సంస్కృత నాటక సాహిత్యంలో నుంచి దీనిని ఉదహరించారు.

శ్లోకం

నానంతి తంత్ర యుక్తం యథాస్థితిం
మండల మఖిలిఖంతి
యే మంత్ర రక్షణ పరాస్తే సర్వ
నారాధి పావు పచరంతి.

ఎవరి తంత్రాలు తెలుసో, ఎవరు ఎల్లప్పుడూ మంత్ర చింతన చేస్తారో, ఎవరు మంత్రాన్ని రక్షిస్తారో వారే యిటు పాముల్ని, రాజుల్ని సేవించ గలుగు తారు.

రాజ తంత్రానికీ, పాముల మంత్రానికీ అటు రాజులకూ, ఇటు పాముల వాళ్ళకూ సరిపడేటట్లు, పెడార్థాలు వున్న ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రవేశిస్తాడన్న మాట. జనం మూగుతారు. వాళ్ళు అడిగే వాటన్నిటికీ సమాధానం చెపుతాడు.

నీవెవరంటున్నారా? జీర్ణ విఘుడనే పాముల వాణ్ణి. ఈ పుట్టలో ఏమున్నదంటున్నారా? మాకు జీవనాధారమైన పాములున్నాయి. చూడాలని వుందా? అయితే ఇది తగిన చోటు కాదుగదా? రాక్షస మంత్రి ఇంట్లోకి రమ్మంటున్నారా? మనలాంటి వాళ్ళకు ప్రవేశం వుండదంటున్నారా? అంటూ ఇది నావృత్తి కాబట్టి తప్పకుండా ప్రవేశ ముంటుంది.

ఇలా సమాధానాలు సాగిన తరువాత పాముల వాడు రాక్షస మంత్రి ఇంట్లోకి వ్రవేశిస్తాడు. ద్వారపాలకుడు అడ్డగిస్తాడు. నేను రాక్షస మంత్రి ఎదుట పాములాట