పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండీ, పండితులూ, పామరులూ, అందరూ ఆ భజనలకు హాజరై ఆనందించి, తద్వారా ముక్తి మార్గాన్ని వెతుక్కుంటారు.

కొంత మంది వార్ధక్య దశలో, జీవితం మీద విరక్తి భావంతో, భగవందుని పాద సన్నిధిని చేరు కోవాలనే తాపత్రయంతో,వ్వక్తి గతంగా, తులసీ దాసులా, త్యాగరాజులా, పురంధర దాసులా భక్త తుకారాంలా, భక్త జయదేవుడుగా, నామ దేవుడుగా, మీరా బాయి, సక్కుబాయి, ఆండాళ్ళు, రామ కృష్ణ పరమ హంసలా ఒక రేమిటి... అందరూ తన్మయత్వ గీతాలాలాపించి పల్లె ప్రజలను తన్మయుల్ని చేసి, వారిలో అంతరాత్మ ప్రభోధం కలిగించారు.

ఉదాహరణకు ఒక పాట:

ముఖ్యంగా అన్ని భజన పాటల్లోనూ తెలుగు నాట రామునికి సంబంధించిన పాటల్నే ఎక్కువగా పాడుతారు. అందుకు కారణం శ్రీరాముడు తమ స్వంత దైవమనీ భావిసారు. శ్రీరాముని మీద ముఖ్యంగా భద్రాది రామదాసు వ్రాసినవీ, పాడినవీ ఎన్నో ఉన్నాయి.

అదిగో భద్రాద్రి:

తరాళ రాగం, ఆదితాళం.

ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి॥
ముదముతొ సీతరామ ముదిత లక్ష్మణులు
కలిసి కొలువగా రఘుపతి యుండెడి ॥ఇదిగో॥
చారు వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో
సుందరమై యుండెడి ॥ఇదిగో॥
అనుపమానమై అతి సుందరమై
దనరు చక్రముగ ధగ ధగ మెరిసెడి ॥ఇదిగో॥
కలియుగమందున నిల వైకుంఠము
నలరుచున్నది, నయముగ మ్రొక్కెడి ॥ఇదిగో॥
శ్రీ కరముగను రామ దాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువునివాసము॥ఇదిగో॥