భజ గోవిందా, గోపాల బాల కృష్ణమ్మా
కాళ్ళకు జగ్గెలు కట్టి వేళ్ళకుంగ్రాలు పెట్టి
పిల్లంగోరు చేతికి ఇచ్చి... ఫింఛము పట్టెద
కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ ॥
అంటూ విందులు వేసి తన్మయులౌతారు. ఎంతెందుకు
పది కొంపలు లేని పల్లెనైనను రామ
భజన మందిర ముండు వరలు గాత
రామ నామము భవస్తామ భంజనదివ్య
తారక నామమి దనరు గాత,
అని పానుగంటి వారి రచన పాదుకలో దశరధుని నోటి వెంట పలికించడాన్ని బట్టి ఆంధ్రదేశంలో రామ మందిరం లేని గ్రామం లేదు. అలాగే శివాలయాది విష్ట్వాలయాలు.
- భజనల కోలాహలం:
పల్లెప్రజలు వారి వారి వ్వవసాయపు పనులు చూసుకుంటూ, విరామ సమయాల్లో యువకులు, వృద్ధులు భజనలు చేస్తూ వుంటారు. శక్తివంతులైన యువకులు నృత్యంతో కూడిన శావమూళ్ళ భజనలు అంటే తాళాల భజనలు, చెక్క భజనలు చేస్తే వృద్ధులు కూర్చుని చేతాళలతోనూ, చిరుతలతోనూ హరిభజనలు, పండరి భజనలు చేస్తారు. మరికొందరు కోలాటపు చిరుతలతో కోలాట నృత్యాలు భక్తి భావంతో చేస్తారు. శ్రీరామ నవమికి, దసరా పండగకు, భజన బృందంలో వున్న వారందరూ వివిధ పాత్రలు విభజించుకుని భజన పద్ధతిలోనే నాటకాలను ప్రదర్శిస్తారు. మధ్య మధ్య పద్యాలతో, పాటలతో, సామెతలతో సున్నితమైన హాస్యంతో తెల్లవార్లూ గ్రామస్థుల్ని ఆనంద పరుస్తారు.
కొన్ని బృందాలలో అందరూ ఒకే విధమైన రంగు పంచలు కట్టి, అలాగే నడుంకు కట్టులు కట్టి వలయాకారంగా తిరుగుతూ, ఎగురుతూ గెంతుతూ భజనలు చేస్తూ వుంటే చూపరులు తన్మయులౌతారు.