పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/418

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

భజనలు, రామ భజనలు


ఒక నాడు పల్లె ప్రజలను భక్తితో ఆనంద పారవశ్యంలో ముంచిన భజనలు, ఆంధ్ర ప్రజా జీవితంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించు కున్నాయి. భజించటం, కీర్తించటం, స్తుతించటం వేదకాలం నాటి నుంచి ఈ నాటికి వరకూ పరిపాటైపోయింది.

ఎన్నో భజనలు, ఎందరో భక్తులు:

కష్టదశలో నున్న మానవులు భగవంతుని స్తోత్రం చేస్తారు. కొందరు వ్వక్తిగతంగా భజన చేస్తే మరికొందరు సమిష్టిగా చేస్తారు. కొందరు భగవంతుని స్తుతిస్తూ పాడతారు. మరి కొందరు ఆడతారు. ఇంకా కొందరు కూటంగా చేరి భజనలు చేస్తారు. భజనలను భక్తి పారవశ్యంతో చేస్తారు, అందరూ సమిష్టిగా పాడుతారు. లయబద్ధంగా తాళాలను మ్రోగిస్తారు. మరికొందరు చెక్క భజనలు చేస్తారు. కొందరు ఒక బృందంగా చేరి కోలాటాలు వేస్తారు. మరి కొందరు కూర్చునే హరిభజనలు చేస్తారు. ఇంకా కొందరు జయదేవుని అష్టపదులను పురంధరదాసు కీర్తనలను, తుంగదుర్తి కృష్ణదాసు కీర్తనలనూ, నారాయణ తీర్థుల తరంగాలనూ, అన్నమాచార్య గేయాలను చిరుతలతోనూ చెక్కలతోనూ, తాళాలతోనూ, తంబురాలు పుచ్చుకునీ కాళ్ళకు గజ్జెలు కట్టుకునీ పారవశ్యంతో భజనలు చేస్తారు.

ఉదాహరణలు:

హరిలో రంగ హరి, హరిలో రంగ హరి
కృష్ణమ్మా, గోపాల బాల కృష్ణమ్మా