Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాత్ర చేస్తూ ఆయన చూసిన విషయాలను గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథంలో పైన హెబరు గారు ఉదహరించిన చరత్కుపూజా భానుపొడా అనే ఉత్సవ సందర్బంలో సిడు లాడడం తాను చూసినట్లు తమ కాశీ యాత్రలో వుదహరించారు.

ఈనాటికీ తమిళనాడులో:

ఈనాటికీ తమిళనాడులో ఆయా జిల్లాలలో ఇలాంటిగాలపు సిడి అక్కడక్కడ జరుగునేనే వుంది. అయితే అధికారులు దీనిని నిషేధిస్తూ వుంటారు. ఈ నాడు గాలపు సిడి మార్పు చెందింది. చేతిలో కత్తి వున్న ఇల కొయ్య బొమ్మను తయారు చేసి రంగు రంగుల హంగులతో అలంకరించి, అమ్మవారి తీర్థాల సమయంలో ఊరేగిస్తారు.

సిరిబొమ్మ తీర్థం పేరిట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంక్రాంతి పండుగ దినాలలో అమ్మవారి గుడి యెదుట అయిదు రోజులు ఆడిస్తారు. కొయ్య బొమ్మను త్రిప్పుతూ వుంటే చూసే ప్రజలు బొమ్మ మీదికి ఆరటి పళ్ళను విసురుతారు.

సిడి బండి, సుడి బండి:

నా చిన్న తనంలో సిడి వుత్సవాన్ని సుడి బండి వుత్సవంగా కృష్ణజిల్లా వుయ్యూరు వీరమ్మ తిరునాళ్ళలో చూసాను. సుడి బండి అంటే ఎడ్లు లేకుండా మనుషులే బండి వెనుక ప్రక్కను అదిమి పట్టి ముందు పోలును పైకి ఎత్తేవారు. ఇలా ఎత్తడాన్ని సుడి వేయడ మనేవారు. పైకి ఎత్తబడిన ముందు ప్రక్క పోలులుకు ఒక తట్టను కట్టి, ఆ తట్టలో మ్రొక్కు కున్న వారిని కూర్చో పెట్టి మనుషులే ఆ బండిని వూరంతా త్రిప్పి చివరికి

గుడి చుట్టూ త్రిప్పేవారు. ఈ సమయంలో, పండ్లూ పూలు ఆ బండి మీద విసిరేవారు. వాద్యకాండ్రు వీరంగం వేస్తే ప్రేక్షకులు అందుకు అనుగుణంగా నృత్యం చేసేవారు. ఈ దృశ్యాన్ని ప్రజలు విరగబడి చూసేవారు.