పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయలసీమ కళారూపం జట్టి జాము


ధనుర్మాసపు నెల రోజుల్లో సంక్రాంతి పండుగల్లో ప్రతి ఇంటి ముందూ రంగు రంగుల రంగవల్లులను అలంగరించి ఆ ముగ్గుల మధ్య పసుపూ కుంకుమా పూలతో అలంకరించి వాటిపై పేడ ముద్దలతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పండుగ సమయాల్లో పది మంది యువతులు చేరి, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యలో అంటూ గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ ఒంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు. ఇది సహజంగా సర్కారు ప్రాంతంలో వున్న పద్దతి.

ఇలాంటిదే గుజరాత్ లోనూ, మహారాష్ట్ర లోనూ, గర్భా నృత్యం అనేది వుంది. అదే గొబ్బి నృత్యం కావచ్చనీ "లాలీగర్భా అనే ప్రభేదమే" జట్టి జామును పోలే నృత్యమనీ, జట్టి జామును గురించి, ఆచార్య తూమాటి దొణప్ప గారు వారి జానపద కళా సంపద 190 పేజీలో వుదహరించారు.

జట్టి జాము అంటే?

పై ఉదాహరణలకు సంబంధించే ఈ జట్టి జామంటే అది తాళ ప్రధాన కళ అనీ, గొబ్బిలో లాగా ఈ కళారూపంలో గుండ్రంగా చుట్టి రావటం వుండదనీ కోలాటంలో మాదిరి చేతిలో కోలలు గానీ, చెమ్మ చెక్కలో మాదిరి గెంతడం గాని వుండదనీ, కాలుకదప కుండానే వున్న వాళ్ళు వున్న చోటే వుండి జట్టి జాము చేయవచ్చంటారు దొణప్ప గారు.