Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ సిడి మ్రాను కొయ్యను పైకి వేవనెత్తుతారు. దానితో పాటు ఆ అమ్మాయిని కూడ పైకి లేవనెత్తుతారు. ఈ దృశ్యాన్ని చూసిన జన సందోహమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ అరుస్తారు. సిడి మ్రాను త్రిప్పుతూ వుంటే, ఆ అమ్మాయి గాలానికి తగులుకున్న చేపలాగ ప్రేలాడుతూ వుంటుంది. చూసే వారికీ దృశ్యం చాల భయంకరంగా వుంటుంది. ఆ అమ్మాయి మాత్రం ఎంత భాధ వున్న కిక్కురు మనదు. పైగా తన్మయత్వంతో తన చేతిలో వున్న కత్తిని అటూ ఇటూ ఝుళిపిస్తుంది. కాబోయే తన భర్త మీదికి తన చేతిలోని నిమ్మకాయలను విసురుతుంది.

ఇలా కొంత సేపు ఆ సిడి మ్రాను కొయ్యను గిరగిరా త్రిప్పి, ఆ తరువాత ఆవిడను క్రిందికి దింపుతారు. ఆ రక్తపు గుడ్డలతోనే, ఆవిడ ఆ గుడిలోనికి వెళ్ళి దేవతా దర్శనం చేస్తుంది. తరువాత ఆమె గాయానికి కట్టు కడతారు. ఆ అమ్మాయి తాహతును బట్టి, ఆ గ్రామ దేవతకూ అక్కడ చేరిన బ్రాహ్మణులకూ దానాలు ఇస్తుంది. పేద వాళ్ళకు అన్నదానం చేస్తుంది. అక్కడికి వచ్చిన పెద్దలను సత్కరిస్తుంది. ఇలాంటి సిడుల వుత్సవాలు సాధారణంగా దుర్గ గుడి దగ్గర జరుగుతాయి. వుత్సవానంతరం మ్రొక్కుబడి తీర్చిన ఆ అమ్మాయి ఎంతో సంతృప్తిని పొందుతుంది.

వంగ రాష్ట్రంలో:

వంగ రాష్ట్రంలో (అంటే ఈనాటి బెంగాల్) దుర్గా దేవికి ప్రీతి పాత్రంగా చేసే చరత్కుపూజ యనే వుత్సవాలలో ఇలాగ సిళ్ళు తిరిగటం అనాదిగా జరుగుతూ వుంది. 1823 -26 మధ్య కలకత్తాలో ప్రధాన (క్రైస్తవ మతాధికారిగా వున్న బిషప్ హెబస్రు గారు దేశంలో తాను చూసిన విషయాలన్నిటినీ తన దినచర్యా గ్రంథంలో ఇలా వర్ణించారు. 1824 వ సంవత్సరం, ఏప్రిల్ 9 వ, తేదీన తాను చూసిన "చరత్కుపూజ" జాతరలో తాను చూసిన ఒక సిడిని వర్ణించాడు.

ఏనుగుల వీరాస్వామయ్య:

దక్షిణ భారత దేశానికి చెందిన ఏనుగుల వీరాస్వామయ్య గారు కాలి నడకను కాశీ