పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ దేశపు స్త్రీలు, దేవతల్ని కొలవడంలో అతి ఘోరమైన సాహసాలు చేస్తారని ఈ విధంగా వివరించాడు.

ఒక స్త్రీ ఏ పురుషుడినైనా ప్రేమించి అతణ్ణి పెళ్ళి చేసుకో తలచి నట్టైతే, అతనిని తకకు భర్తగా ప్రసాదిస్తే తాను ముందుగా వచ్చి, ఒక గొప్ప మ్రొక్కుబడి చెల్లిస్తానని దేవతకు మ్రొక్కు కుంటుంది.

ఆమె వరించిన పురుషుడు ఆమెను వివాహమాడడానికి అంగీకరించి నట్లైతే, తాను అతనిని వివాహ మాడడానికి ముందుగా తన రక్తాన్ని ఫలానా దేవతకు ధార పోస్తానని తాను మ్రొక్కు చెల్లించి రావాలనీ చెపుతుంది.

ఆ తరువాత ఆ అమ్మాయి మ్రొక్కు తీర్చడానికి ఒక ముహూర్తాన్ని ఏర్పరుస్తారు. ఆ రోజు ఒక సిడి మ్రానును తయారు చేస్తారు.

ఒక పెద్ద మ్రాను లాంటి స్థంభానికి ఏతము లాంటి ఒక వాసాన్ని కట్టి దాని చివర ఇనుప కొక్కెము లాంటి రెండు గాలాలను తగిలిస్తారు.

సిడి బండి:

ఒక పెద్ద ఏతంలాగ కనబడే ఈ విచిత్రపు యంత్రాన్ని ఒక రెండెడ్ల బండి మీదికి ఎక్కించి గుడి దగ్గరకు తోలుకొని వెళతారు. ఆ మ్రొక్కుకున్న అమ్మాయి తన బంధువులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, భాజా భజంత్రీల తోనూ ఊరేగుతూ గుడి దగ్గరకు వస్తుంది.రకరకాల అంగళ్ళూ, ఆటగాళ్ళూ, వాయిద్య గాళ్ళూ, పాట గాళ్ళూ, నృత్యం చేసేవారూ, భజనలు చేసే వారూ, కోలాటాలు వేసేవారూ కోలాహలంగా మూగి వుంటారు.

గాలపు సిడిని ధరించే ఆ అమ్మాయి తలారా స్నానం చేసి, తల విరయ బోసుకుని వుంటుంది. ఒంటిమీద కట్టుకున్న వస్త్రం తప్ప ఇతర అలంకారా లేమీ వుండవు. గుడి దగ్గర సిడి మ్రాను పెట్టి వున్న బండి దాగ్గరికి ఆవిడ రాగానే ఏతాము కొయ్యను క్రిందికి దింపుతారు. దాని చివరనున్న గాలపు కొక్కెమును ఆ అమ్మాయి వీపు చర్మానికి గ్రుచ్చి పైకి లేవనెత్తి నపుడు, కండ పూడి రాకుండా, దిగివున్న గాలపు కొక్కెము పైభాగాన్ని ఆవిడ నడుముకు చీర చెంగును గట్టిగా బిగించి కడతారు. ఒక ప్రక్క రక్తం కారుతూనే వుంటుంది ... ఆ అమ్మాయి ఎడమ చేతి కొక పొట్టి కత్తి నిస్తారు. కుడి చేతిలో నిమ్మ పళ్ళు వుంటాయి. ఆ తరువాత