పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంబోధరము క్రింద నసిమాడు
నైరావతియు బోలె సిడి ప్రేలెఁదెఱవయోర్తు

అని పాండురంగ మహాత్య ములో మూడవ అశ్వాసం, 77 వ పద్యంలో అమ్మవారి జాతరలో ఒక స్త్రీ సిడి తిరుగుటను గూర్చి వ్రాయబడి వున్నది.

క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిన హిందూ దేశంలో పర్యటించిన పోర్చు గీసు చరిత్ర కారుడైన బర్బోసా గ్రామ దేవతల కొలువులో జరిగే సిడి ని చూసి ఇలా వర్ణించాడు.