Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధారణంగ ఈ చిందు కళాకారులు ఒకే ఒక కుటుంబానికి చెందిన వారై వుంటారు. ఆ కళాకారుల బృందాన్ని మేళం అని పిలుస్తారు.

ఆర్మూరు చిందు భాగవతులు:

ఆర్మూరు చిందు భాగవత బృందానికి సలహా సంఘ కార్య దర్శి ఎం. నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్మూరు నిజామా బాద్ జిల్లాలో వుంది. వీరు సారంగధర నృత్య నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శిస్తారు. అద్దాల బిళ్ళలు, బంగారు రంగు ముచ్చి రేకులు అంటించిన కిరీటాలు, అతి ప్రాచీనమైన, వివిధ రకాలైన ఆభరణాలు, ధరించే దుస్తులు కళ్ళు మిరుమిట్లు గొల్పుతాయి. బృందలో వున్న ప్రతి ఒక్కరూ కేవలం చిందు నృత్యం తొక్కడమే కాక, అందుకు తగిన అభినయాన్ని హావ భావ యుక్తంగా ప్రదర్శిస్తారు.

చిందుల యల్లమ్మ:

ఈ బృందానికి చిందుల యల్లమ్మ ప్రత్యేక అలంకారం, ఆమె సారంగ ధరలో చిత్రాంగి పాత్గ్రను ధరించి, నవరసాలనూ, నవరస భరితంగా ఒప్పిస్తూ ఆబాల గోపాలాన్ని రంజింప జేయగల ప్రసిద్ధ నటి.

ఆమె స్త్రీ పాత్రల్ని ఎంత సమర్థ వంతంగా పోషిస్తుందో, పురుష పాత్రల్ని కూడ అంత సమర్థవంతంగా పోషిస్తుంది. ఈమె నటనా వైదుష్యాన్ని గుర్తించి