పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ అధ్యక్షులు, నటరాజ రామ కృష్ణ గారు అకాడమీ విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించారు.

ఈ బృందంలో సారంగధర నాటకంలో రాజరాజ నరేంద్రుడుగా "చిందుల శ్యాం", సారంగధరుడుగా "చిందుల శ్రీనివాస్", చిత్రాంగిగా "చిందుల యల్లమ్మ" రత్నాంగిగా "చిందుల వెంకటరత్నం", చెలికత్తెగా "చిందుల రాజేశ్వర్ ."__

వీరు గాక "చిందుల గంగాధర్", "చిందుల బాబయ్య " "చిందుల నీలమ్మ", "చిందుల సుశీల", "చిందుల చిన్నమ్మ", మొదలైన వారు ఉత్తమ కళాకారులు.

అర్మూరు భాగవతుల్లో మృదంగాన్ని "చిందుల గోపాల్ " తాళం "చిందుల శ్రీమతి శృతీ" "ఎన్. చంద్రయ్య" మొదలైన వారు నిర్వహిస్తారు.

రామకృష్ణ ఆదరణ

అసలే తెలంగాణా వెనుక బడిన ప్రాంతం, అందులో సమాజంలో బాగా వెనకబడి పోయిన వారు వీరు, ఒక్క తెలంగాణాలో తప్పా సర్కారాంధ్ర దేశంలో మరెక్కడా ఈ కళారూపం కనిపించదు. నాటకం, సినిమా, రేడియో, టీవీ, వీడియో మొదలైన అత్యాధునిక కళారూపాల తాకిడికి ఇలాంటి కళారూపాలన్ని తట్టుకోలేక శిధిలమై పోతున్నాయి.

శిథిలమై పోయే ఈ కళారూల్ని బ్రతించాలని, నటరాజ రామ కృష్ణ చిందు కళాకారుల పరిస్థితి పరిశీలించి, ఈ మహత్తర కళారూపం అంతరించి పోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించేలా చేశారు.