పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతి గ్రామంలోనూ వీరు ప్రదర్శనం ఇచ్చే సమయంలో ..... ఎల్లమ్మ ఆట ఆడటం వారి ప్రత్యేకత. తమ జీవితాలు మోడువారి పోయినా గ్రామాలు

సస్యశ్యామలంగా వుండాలని కోరుతూ తన్మయత్వంతో ఆడతారు. ఆ ఆటవల్ల కరువు కాటకాలు రావని నమ్మే ప్రజలు ఈ నాటికి నిజామాబాద్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో వున్నారు.

ప్రదర్శించే నాటకాలు:

సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన ఈ కళాకారులు, ప్రదర్శించే నాటకాలలో ముఖ్యమైనవి, మోహినీ రుక్మాంగద, సారంగధర, చెంచు లక్ష్మి, వీరాభిమన్య , సుందర కాండ, సతీ సావిత్రి, మైరావణ మొదలైన నాటకాలను ప్రదర్శిస్తూ మధ్య మధ్య ప్రజల సమస్యలను సందర్బోచితంగా చొప్పిస్తూ పేద ప్రజానీకాన్ని ఆకట్టు కుంటారు.

చిందు నృత్యాన్ని ప్రదర్శించే సుమారు ఏభై దళాలు నిజామాబాదు జిల్లాలో వున్నాయి. వంశ పారంపర్యంగా తమ పెద్దల వద్ద విద్య నభ్యసించి, ప్రజలకు వినోదాన్ని కూర్చే ఆచారాన్ని, ఈ తెగ పాటిస్తూ వుంది. ఎవరి పాటలు, పద్యాలు వారు పాడాతారు, తాళాలు వాయించడానికి మాత్రం స్త్రీలు వుంటారు. నృత్యంలో, ఆడ వారికీ, మగ వారికీ పెద్ద తేడా కనిపించదు.