భారత భాగవాత విద్యల్లో భావ మెరిగి అభినయించే నాట్య విశారద శ్రీమతి పందిరి వెంకటరత్నం ఈమె శిష్యురాలు. వెంకట రత్నం స్వర్గీయ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రుల గారిచే సన్మానింప బడిన విద్వాంసురాలు.
- భామా కలాపానికి ధీమా తెచ్చిన దూడల శంకరయ్య:
భామా కలాపం ప్రత్యేకమైన ఆంధ్రుల కళ దానికి సిరి తెచ్చింది. శ్రీకాకులం జిల్లా. అనాది నుండీ ఆ జిల్లాలో సుమారు 40 కుటుంబాల వారు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవించే వారు. ఈనాడు అన్ని కుటుంబాలు లేవు. చెప్పుకో తగిన పండితులు కూడ అంత మంది లేరు. కాని సిగడాం వాస్తవ్యులైన దూడల శంకరయ్యా గారు ఈ భామకలాప విద్యలో సిద్ధ హస్తులు. వీరు భామాకలాపం పాలిటి ధీమా తెచ్చిన భీమా. వీరి తరువాత ఈ భామా కలాపకళ అంతరించి పోయే అవకాశముంది. దీనిని సంస్కరించి ప్రదర్శిస్తే ఆంధ్ర నృత్య కళలో ఒక మహోత్కృష్ట కళగా రూపొంద గలదు.
భామాకలాప విద్యలో సిద్ధ హస్తులైన దూడల శంకరయ్య గారు లయ బ్రహ్మ. వారిది లయ బద్ధమైన అద్భుత కళ. అది ఆంధ్రుల పురాతన కళా ఖండం. శంకరయ్య గారి భామ కలాపంలోనీ బాణీలు, పదాలు, పాటలు ఆయన కుమారుడు వాయించే మృదంగ దరువులు అద్భుతమైనవి. ఆంధ్రదేశంలో కూచి పూడి వారూ, దేవదాసీలు ప్రదర్శించే భామ
కలాపానికి, శంకరయ్య గారి భామా కలాపానికీ ఎంతో వ్వత్యాస ముంది. అందువల్ల ఈ కళను ప్రత్యేకంగా పోషించ వలసిన అవసర ముంది.
- బొంతల కోటి జగన్నాథం:
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొంతల కోటి జగన్నాథం గారు కూడా భామాకలాపం ప్రదర్శించడంలో సిద్ధ హస్తులు. వీరి సాంప్రదాయమూ, దూడల శంకరయ్య గారి సంప్రదాయమూ ఒకటే.