కూచిపూడి ఎంతటి ప్రఖ్యాతి వహించిందో గోదావరి మండలంలో మండపేట కచేరీ నాట్యంలోనూ, కర్ణాటక, భామా గొల్ల కలాపంలోనూ అంతటి సరస్వతీ పీఠంగానూ వర్థిల్లింది. శ్రీమతి పందిరి వెంకటరత్నం, వానపల్లి వీర్రాజు
మొదలైన వారు భామాకలాప, గొల్లకలాప విద్యలను అనేక సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో ప్రదర్శిస్తూ వచ్చారు. 1949 సంవత్సస్రంలో విజయవాడలో జరిగిన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి సన్మాన సందర్భంలో వెంకటరత్నం సమయాను కూలంగా సన్మానించబడింది. ఈవిడ రేడియోద్వారా ఎన్నో భామాకలాప ప్రదర్శనాలను ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఈమెను ఘనంగా సన్మానించింది.
- దుగ్గిరాల మాణిక్యం:
మండపేట మాణిక్యం అని కూడ పులువబడే దుగ్గిరాల మాణిక్యం జన్మస్థలం మండ పేట. సంస్కృతాంధ్ర భాషలనూ, సంగీత నాట్యాలనూ అమోఘంగా ఆకళింపు చేసుకున్న విదుషీ మణి ఈమె. భాగవత సంప్రదాయాలను ప్రచారం చేయడంలోనూ కచేరీ నృత్యంలోనూ ఆంధ్ర దేశానికి పేరు తెచ్చిన కళాకారిణి. ఈమె నిజంగా నాట్య సరస్వతి.