పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారాన్ని భూమి భరిస్తోంది. ఎటు చూసినా పండ్లవాసనలు, పక్షుల కిలకిలారావాలు, ఆకలి దప్పులతో అలమటిస్తున్న అడవి గుంపులకు ఆహారం దొరికింది. ఆకలి తీరింది. హమ్మయ్య అన్నారు. దీనికంతకూ కారణం ప్రకృతే అనుకున్నారు. ప్రకృతినే దైవంగా పూజించారు.

పూజలూ, పునస్కారాలూ :

ఒక గుంపువారు సూర్యుడే భగవంతు డన్నారు. మరోగుంపు వర్షాన్నే దేవతగా చిత్రించింది. ఇంకోగుంపు ప్రకృతి మాతనే పూజించింది. ఇలా సంతోషాన్ని పట్టలేక ఎవరి నోటికి వచ్చిన పదాలను వారు సమకూర్చుకున్నారు. గొంతెత్తి కేకలు వేశారు. కేకలే పాటలైనాయి. ఆనందంతో అవయవాలన్నీ చలించాయి. స్త్రీలూ, పురుషులూ కేరింతలు కొడుతూ నోటితో పాటలు పాడ నారంభించారు. స్త్రీలు పుష్పాలను తీసుకున్నారు. పురుషులు కందమూలాల్ని తీసుకున్నారు. వారి వారి భక్తికొద్దీ నైవేద్యాలు చెల్లించారు. వారి సంతోషాన్ని, తృప్తినీ విజయాన్ని పాటలతో ఆటలతో వెల్లడిచేసి ఆనాడే ఆటవికజాతి జానపద కళల పునాదుల్ని వేశారు.

కడుపు కూటికై, కాట్లాటలు :

ఆనాడు ఆటవికులకు ప్రతినిత్యం ఆహార సమస్య ఘోరంగా వుండేది. వారికి పంటలు లేవు . ఎలా పండించాలో తెలియదు. నాగలికొయ్య ఆనాటికింకా పుట్టలేదు. అడవిలో మ్రగ్గిన పండ్లనూ, దుంపలనూ, జంతువుల పచ్చిమాంసాన్నీ తినేవారు. ఇలా వారు ఆహారం కోసం గుంపులు గుంపులుగా బయలుదేరి సమిష్టిగా ఆహారాన్ని సాధించేవారు.

ఈ ఆహార సాధనలో గుంపుల మధ్య కలహాలు వచ్చి ఒకారి నొకరు జయించుకునే వారు. ఈ దండయాత్రలో భీకరమైన కేకలూ, గంతులూ వేసేవారు. విజయానందంతో, వీరనృత్యాలు చేసేవారు, నోటికొచ్చిన కవితలు ఆశువుగా చెప్పేవారు. ఆ కవితల్ని ఆనందంగా గానం చేసేవారు.

భజనలూ, భక్తిగీతాలూ :

ఈ విధంగా ప్రాచీన మానవజాతులు, నృత్య, గీత, అభినయాలతో కాలం వెళ్ళబుచ్చేవారు. ఇందులో కొంతమంది తన్మయీభావంతో నిపుణత్వాన్ని ప్రదర్శించే