Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె అభినయ విద్యను కోటిపల్లి వాస్తవ్యులు కడియాల రామమూర్తి గారి వద్దనూ, సంగీతాన్ని మహోద్రాడ పద్మనాభంగారి వద్దనూ, కొల్లకలాపాన్ని, భామా కలాపాన్ని అత్కూరి సుబ్బారాయుడి గారి వద్దనూ, కలాపంలో వేదాంత విద్యను జయంతి స్వామి నాయన గారి వద్దనూ నేర్చుకుంది.

కోనసీమలో గొప్ప పేరు:

ఆమె భామాకలాపం, గొల్లకలాపం, కచేరీనాట్యం మొదలైన విద్యలలో కోనసీమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినల నట్టువరాలు. రాజమండ్రి భారత సంస్కృతి సభ, కాకినాడ సాహిత్య పరిషత్తు, మద్రాసు సంగీత నాటక అకాడమి మొదలైన అనేక సంస్థలు ఆమెను సన్మానించాయి.

ఉభయ విద్యా ప్రవీణ శ్రీమతి మద్దెల రాముడు:

విజయనగరం వాస్తవ్యులు మద్దెల రాముడు సంప్రదాయ కచేరీ నృత్యవిద్యలోనూ, కర్ణాటక విద్యలోనూ ఆరితేర్రిన విద్వాంసురాలు. ఆమె తన విద్యతో ఒక్క విశాఖ మండలమే కాక ఆంధ్ర దేశంలో పలు తావుల్లో ప్రదర్శన లిచ్చి మెప్పు పొందింది. ఈమె నాయకురాలుగా ఎన్నో సంవత్సరాలు ఆ బాధ్యతను నిర్వహించింది. ఎంతో