Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోట. కళ్ళికోట, చీకటి కోట, కలహండి, కరియల్, మధుపూర్, టికిరియా సంస్థానాలో ఆమెను ఘనంగా సన్మానించారు.

ఆమె తెలుగు చనల చిత్ర రంగంలోను ప్రవేశించి 'రాణీప్రమీల ' చిత్రంలో ప్రధాన పాత్ర ధరించి చక్కగా పాడి నటించింది. 1947 లో మద్రాసు రేడియో ప్రసారం చేసిన సీతారామ కళ్యాణం, సుందరకాండ, సక్కుబాయి, శ్రీరామ జననం, భక్త రామదాసు నాటకాల్లో పాల్గొని అత్యుత్తమంగా నటించింది.

1934 లో ఆమె అనేక గ్రామఫోన్ రికార్డుల నిచ్చింది. కోకిల 'కోయి ' అని కూయగా, వ్యాకుల మానసమాయేగా, చిటపట చినుకులు దుప్పటి తడిసెను, పచ్చ బొట్టు ప్రాణనాథా....సై పగజాల, రాత్రి నాటకం, ఏరా నాప్రియ మొదలైన పాటల రికార్డుల వెలువడ్డాయి. చింతామణి గ్రామ ఫోను రికార్డుల నాటకంలో చింతామణీ పాత్ర ధరించింది.

1964 మార్చి 17 వ తేదీన ఆమెను ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ హైదరాబాదు రవీంద్ర భారతిలో సన్మానించింది.

నృత్య ప్రదర్శనం ద్వారా కళావర్ రింగ్ అపారంగా ధనం ఆర్జించింది. అనేక మంది బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసింది. అంతే కాదు, అవసరాల్లో వున్న వాళ్ళస్ను ఆదుకుని అనాథులకు ఆశ్రయం ఇవ్వటం ఆమె సుగుణాలు. ఆమె అంతిమ దశలో, అకాడమీ వారి వేతనంతో, హరికథా గానంతో జీవితం గడిపి 1964 లో స్వర్గస్తురాలైంది.

కోనసీమ కెల్ల మిన్నగా ఎన్నికైన అన్నాబత్తుల బుల్ల్లి వెంకటరంత్నం:

ఈమెను అన్నబత్తుల చిట్టి అనే చాలమంది పిలుస్తూ వుంటారు. ఈమె తరతరాలుగా అభినయ విద్యను ప్రదర్శించే విద్వత్కుటుంబంలో జన్మించింది. బుల్లి వెంకటరత్నం ఆరు సంవత్సరాల పూప ప్రాయంలోనే అమ్మమ్మ వద్ద అరుదుగా భరత నాట్యాన్ని నేర్చుకుంది. కుటుంబంలో కడసారి బిడ్డ అవడం వలన కుటుంబం లోని వారందరూ ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేసారు. ఆమె అభినయం, సంగీతం, అధ్యాత్మ అష్టపదులు, తరంగాలు, అభినయమూ, సరస భూపాలీయము, నాయికా నాయక ప్రకరణము సాంప్రదాయికంగా నేర్చుకుంది.