Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"చతుర్బాణాలనే అభినయంలో ఉపయోగించాలి కానీ, నీవు పంచ బాణాళు ఉపయోగించావు. అందువల్ల స్థలం మైల పడింది. అందు చేత కళామ తల్లికి కలిగిన ఈ కళంకాన్ని భరించలేక ఈ రూపంలో నీకు తెలియ జేయవలసి వచ్చింది. అని అనడంతో సాష్టాంగ దండ ప్రణాలు ఆచరించి, తన బసకు తీసుకుపోయి, పండితు లిద్దరినీ సత్కరించి, కానుక లిచ్చి గౌరవించి శాస్త్రిగారి శిష్యురాలిగా చేరిపోయింది.

పాటకత్తెగానూ, ఆటకత్తెగానూ ప్రశస్తి గాంచిన 'కళావర్ రింగ్.'

కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజ నర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసిన కళాకారిణి కళావర్ రింగ్ అనే పేరుతో చెలామణి అయిన అయిన శ్రీమతి సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొండ గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విదాభ్యాసం చేసి శ్రీ మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, శ్రీ ద్వారం వెంకతస్వామి నాయుడు శిష్యులైన శ్రీ మద్దిల సత్య మూర్తి, శ్రీ చాగంటి రంగ బాబు, శ్రీ కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం నాయకురాలుగా వ్వవహరించింది. ఆమె నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.

ఆంధ్ర దేశంలోనూ , రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ నానారాజ సందర్శనం చేసి సంగీత నృత్య విద్యలో మహా పండితుల్నీ మెప్పించి, నాట్య తరంగిణి, నవవసంత కోకిల, గాన కళా కోవిద అనే బీరుదులతో సువర్ణ హస్త కంకణాల బహుమానాలతో సన్మాలు అందు కున్నది. జయపూర్, ధారా