పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాట్యంలోనూ, దేవదాసీ నృత్యం లోను కూడ ఘటికురాలు. విద్యలో ఆమెను మించిన వారు లేరనేటంతటి గర్విత. ఒక సారి నర్సాపురంలో ఒక వైశ్యుల ఇంట ఒక వివాహ సందర్బంలో ఈ సుందరి తన బృందంతో గజ్జె కట్టింది. మెడనిండా మెడల్స్ ధరించి ఠీవిగా రంగస్థలంలో ప్రవేశించింది.

ఈ వివాహానికి శ్రీ చెళ్ళస్పిళ్ళ వేంకట శాస్త్రిగారూ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రిగారూ (ఈ సందర్భాన్ని పురస్కరించుకుని , ముఖ్యంగా ఆమె విద్యలు పరీక్షించడానికి) వచ్చారు. సుందరి పుష్పబాణ విలాసంలోని ఈ సంస్కృత శ్లోకాన్ని అభినయంతో ప్రారంభించింది.

కాంతో యాసతి దూరదేశ మితి చింతా పరం జాయతే,
లోకానంద కరోపి చంద్రవదనే, వైరాయాతే చంద్రమాః

అంటూ శ్లోకాన్ని పదస్విభాగం చేసి అభినయానికి ఉపక్రమించింది. ఆ సందర్భంలో పంచ బాణాలను అభినయారూపంలో ప్రదర్శించె పద్దతి చూపెట్టడానికి శ్లోకాన్ని ఇలా ప్రారంభించింది.

ఆరవింద మశోకంచ చూతంచ నవమల్లికా,
నీలోత్పలంచ పంచైతే పంచ బాణస్యసాయకాః

అరవిందము__ అశోకము__చూతము __ నవమల్లిక__ నీలోత్పలమూ మొదలైనవి మన్మథుని పంచ బాణాలు. ఈ అభినయంలో సుందరి పంచ బాణాలనూ ప్రయోగించింది. అసలు రంగం మీద చతుర్బాణాలే అభినయ రూపంలో ప్రదర్శించాలి. పంచమ బాణం ఉపయోగించి నట్లతెతే నాయిక మృతి పొందుతుంది. ఆ తరువాత అభినయించేందుకు నాయిక వుండది. కాని ఈ సుందరి ఆనాటి అభినయంలో పంచ బాణాలనూ ఉపయోగించింది.

వెంటనే పండితులిద్దరూ ఈ సభకు మైల వచ్చిందని కేకలు వేయటం ప్రారభించారు. సభంతా గందరగోళ మైంది. నాయిక బిత్తర పడి పోయింది. ఆ సభలో పండితులిద్దరు వచ్చి కూర్చున్నారన్న సంగతి అంతవరకూ ఈ సుందరికి తెలియదు.

ఈ విషయం తెలుసుకున్న సుందరి వెంటనే సర్రున వెళ్ళి పండితుల పాదాల మీద వాలింది. అప్పుడు శాస్త్రిగారు అభినయంలో కలిగిన లోపాలను చూపించారు.