పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/365

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలాపాలు మొదలైనవీ నట్టువ మేళానికి సంబంధించినవి. ఈ నట్టువ మేళాల్లో పురుషుల హంగుతో స్త్రీలు మాత్రమే నాట్యం చేస్తారు.

పురాణాలకు సంబంధించిన ఇతి వృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్య మేళ, లేక భాగవత మేళ సాంప్రదాయంగా వర్థిల్లింది. ఈ సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు: స్త్రీ పాత్రల్ని కూడ పురుషులే ధరిస్తారు.

ఎందుకు వచ్చినట్లు ఈ పేరు ?

భగవంతునికి సంబంధించిన గాథలను ప్రచారం చేయడం వలన వీరిని భాగవతు లన్నారు. ఆలయాలలో దీపారాధన తరువాతనూ, ప్రత్యేక వుత్సవ సమయాల్లోనూ నృత్యాలు జరుగుతూ వుంటాయి. ఆలయాల్లో ప్రదర్శించే ఆరాధన నృత్యాలు దాదాపు 40 వరకూ వున్నవట.

స్వామి సన్నిధిలో బలిపీఠం పైన నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే ఈ అర్హతను కలిగి వున్నారు. అంటు వంటి వారే నిజమైన దేవదాసీలు. తమె జీవిత సర్వస్వాన్నీ దేవుని సేవకే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహ లాడే వారే దేవ దాసీలు.

పెంచి పోషించిన పెద్దలు:

ఆంధ్ర దేశానికి సంబంధించి నంత వరకూ భాగవత మేళాల ద్వారా నృత్య కళను పోషించిన వారు పోతక మూరి భాగవతులూ, కూచి పూడి, కోట కొండ, మేలటూరు భాగవతులూ.

పూర్వం దేవాలయ నర్తకీమణుల్లో ఒకరిని మించిన వారు మరొక రుండే వారు. వారు నృత్య కళను పట్టుదలగా అరాధించేవారు. పోటీ పడి ఆ విద్య నభ్యసించేవారు.

రాజాస్థానాల్లో మాత్రం అనేక మంది బృంద నాట్యాల్లో పాల్గొనే నాట్యగత్తెలు ఉన్నప్పటికీ, రాజ నర్తకిగా మాత్రం ఒక్కతే నిర్వహించేది. ఆ విధంగా రాయల ఆస్థానంలో రంజకం కుప్పాయి, రఘునాథ రాయల ఆస్థానంలో ముద్దు చంద్రరేఖ__ రూపవతి __ శసిరేఖ __ లోకనాయిక, ప్రతాపరుద్రుని ఆస్థానంలో