పల్లె ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు
ఆంధ్ర దేశంలో దేవ దాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధి లోకి తీసుకువచ్చారు. దేవదాసీల నృత్య కళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. భాగవతులు యక్షగానాలూ, వీధి భాగవతాలు, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు.
దేవదాసీలు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సాంప్రదాయాల ననుసరించి అరాధన నృత్యాలూ, అష్టదిక్పాలక నృత్యాలు, కేశికా ప్రదర్శనాలూ, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు.
- రెండు పోకడలు:
పై వివరాల్ని బట్టి ఆంధ్ర దేశంలో శాస్త్రీయమైన కళ రెండు విధాలుగా అభివృద్ధి జెందింది. ఒకటి నట్టువ మేళ సాంప్రదాయం; రెండవది నాట్యమేళ, భాగవత మేళ సంప్రదాయం. ఈ రెండూ శాస్త్రీయ మైన పద్ధతికి సంబంధించినవై నప్పటికీ ప్రయోగ ప్రదర్శన విధానాలలో భేదం వుంది.
ఆలయాల్లో దేవతా సన్నిధిని దేవదాసీలు చేసే నృత్యం, ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం వద్దనూ, స్వామి కొలువులోనూ వినోద ప్రదర్శనంగా ప్రదర్శింప బడే కేళికా, రాజ దర్బారు ల్లోనూ, ఇతర సభల్లోనూ కళావంతులు ప్రదర్శించే