Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈతని పేరు సంవరణసిద్ధి. ఉజ్జయినీ వాడు. వాసవిదత్తది కూడా ఉజ్జయినే, తన వూరి వాడు కావటం వల్ల వీడి గారడీ చూడటానికి ఆమెకు ఆసక్తి . ఆ పేరుమీద రాజుగారి దర్శనం వీడికి తేలికగా దొరుకుతుంది. కుతూహలంతో వున్న రాజుగారు గారడీ వాణ్ణి వెంటనే ప్రవేశపెట్టమంటాడు.

ఇంద్రజాలికుడు ప్రవేశించి నా పేరులో ఏ ఇంద్రుని పేరు ఇమిడి వుందో ఆ యింద్రునికి నమస్కరించ మంటాడు. ఆ తరువాత మహారాజా భూమి పైన చంద్రుడు, ఆకాశలో పర్వతం, మధ్యాహ్నంలో సాయత్రం వీటిలో ఏది కావాలి!

అడగండి అంటాడు. అలా వాడి కోతలను విన్న, విదూషకుడు మిత్రమా శ్రద్ధగా వును. వీడు అలా చేసేటట్లే వున్నాడు... అని తాను ఉబలాట పడతాడు.

ఈ వుబలాటాన్ని చూసిన గారడీ వాడు అంటాడు. వూరికే నేను నీకు మాటలు చెప్పటం దేనికి, మీరు ఏది చూపించమంటే అదే చూపిస్తానంటాడు.

వాడి మాటలు విన్న రాజు వాసవదత్తను కూడా రమ్మంటాడు. చూడటానికి సరే అందరూ గారడీ చూడటానికి ఆసక్తితో వుంటారు. ఇంద్రజాలాన్ని చూపించమంటారు.

మళ్ళీ వాడు పించికను అటూ ఇటు త్రిప్పి ఇదుగో చూడండి నృత్యంతో కూడిన దేవేంద్రుని దర్బారును చూడండి అంటూ చుట్టూ మూగిన జనాన్ని చూపిస్తాడు. రాజు ఆశ్చర్య పోతాడు.

ఒరే సన్యాసీ, వీళ్ళందరు ఎందుకోయి. సాగరికను జూపమంటాడు. అప్పుడు గానీ రాజుగారు తృప్తి పడరని విదూషకుడు చెపుతాడు.

ఇంతలో యౌగంధరాయణుడు పంపిన ఒక వార్త కారణంగా గారడీకి ఆటంకం వస్తుంది. రాజు గారడీ వానిని ఇక ఆపు అంటాడు. సరే వాడు ఆపేసి, మీరు నాది మరో ఆట చూడాలంటాడు. సరే నంటాడు రాజు. తరువాత వెంటనే అంతః