పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/361

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నరుల వణికించి నీచే
సిరి వొందంజోద్యమిట్లు చేసితి వనియెన్.

ఇది ఆనాటి ఇంద్ర జాల విద్య అని, అదే సందర్భంలో చతుష్టష్టి, కళలైన ఈ క్రింది వాటిని కూడా వివరించాడు. అవే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వాస్తు ఆయుర్వేదం, ధనుర్వేదం, మాంత్రికత్వం, సంగీతం, జలస్తంభన, మహేంద్ర జాలం, జూదం, అష్టావధానం, వాద్య నృత్య కౌశలం, బహురూప పటుత్వం అనగా పగటి వేషాలు, పరిహాసం మొదలైనవి. "సింహాసన ద్వాత్రింశిక" 111- 112 పేజీలలో ఉదహరింప బడిందని సురవరం వారు సాంఘీక చరిత్ర 185 వ పుటలో ఉదాహరించారు.

ఈ ఇంద్ర జాల విద్యల్లో జైనులు ప్రసిద్ధులని పైన ఉదాహరించిన ఇంద్రజాలికుని కథ జైనుల త్రిషష్టికా పురుష చరిత్రలో వుదహరింపబడింది.

ఈ క్రింది జాల విద్యను గురించి యథా వాక్కుల అన్నమయ్య సర్వేర శతకం 12 వ పద్యంలో వివరించాడు.

ఇదే ఇంద్ర జాలానికి సంబంధించిన మరియొక కళారూపం కూడా ప్రాచీన కాలం నుంచీ ప్రచారంలో వుంది. అదే విప్రవినోదం.

గారడీ వాళ్ళూ

రత్నావళి నాటకంలో గారడీ వాడు:
TeluguVariJanapadaKalarupalu.djvu

శ్రీ హర్షుని రత్నావళి నాటకం నాలుగవ అంశంలో ఇంద్రజాలికుని ప్రస్తావన వుంది. సాగరిక మీద విరహంతో వున్న...ఉదయనవత్స రాజుకు ప్రథమంలో వినోదం కల్పించటానికి, తరువాత సాగరికతో సంబంధాన్ని చేకూర్చి పెట్టటానికి ... యౌగంధరాయుణుడు వేసిన ఎత్తు సాగరికయే రత్నావళి. అదే ఈ ఇంద్రజాలికుడైన గారడీ వాని ప్రవేశం.