Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధాన్యాన్నీ సేకరిస్తారు. ఒక వేళ అది భోజనసమయమైతే ఎవరు అన్నం పెట్టినా తింటారు. ఇటువంటి వారిని బుడిగె జంగం వారని పిలవటంకద్దు.

బుడిగె జంగాలు హరిజన, గిరిజన, మాల మాదిగల ఇండ్లలోనూ, ఇంకా వెనుక బడిన వారి ఇళ్ళలోనూ ఎవరైనా చనిపోతే శవ సంస్కార కార్యాన్ని శాస్త్ర యుక్తంగా జరిపిస్తారు. శంఖాన్ని వూదుతూ, గంట వాయిస్తూ, శవం ముందుండి శ్మశానవాటిక వరకూ వెళ్ళి ఆ కార్య క్రమాన్ని పూర్తి చేస్తారు. అందుకు వారు బేడ డబ్బులు మాత్రం ఇస్తే వారిని పొగడుతారు. బేడ డబ్బులతో తృప్తి పడతారు కనుక బేడ జంగాలనే పేరు సార్థకమైంది.

బుడిగెజంగం వీరశైవం
సంస్కారులు:

జంగమయ్యలు, జంగమ దేవరలు, వీర మహేశ్వరులు - వీర శైవ జంగాలనబడే వీరు, మాల మాదిగ గృహాలలో శవ సంస్కారం చేస్తూ శైవులైన మాలలకు బుడిగె జంగాలు గురువులుగా వున్నారు. వీరు మాంసాహారులు, తక్కువ మంది మాత్రమే శాఖాహారులు. వీరిలో వివాహాలకు ఓలి, అంటే కన్యాశుల్కం. 9 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ తీసుకునే పద్ధతి ఈ నాటికీ వుంది. అంటరాని తనాన్ని రూపు మాపటానికే బసవేశ్వరుడు చెప్పిన విధంగా వీరు అందరితో కలిసి