ఈ పుట ఆమోదించబడ్డది
మెలసి జీవిస్తూ, జానపద కళారూపమైన జంగం కథా ప్రదర్శనాల నిస్తూ,ఈ నాటికీ తెలుగు దేశంలో ఆయా జిల్లాల్లో వున్నారు.
- శరభ, శరభ:
వీరు శివరాత్రి పర్వదినాలలో వారున్న గ్రామంలో బండ్ల మీద ప్రభలు కడతారు. వీటిని వీథి వీథికి ఊరేగిస్తారు. శివాలయం వద్దకు చేరుస్తారు.
శరభ, శరభా, దశ్శరభ శరభా
అని ప్రభముందు, సన్నాయి వీరంగానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. ఇది ఎంతో ఆవేశంతో కూడుకుని వుంటుంది.
కొంత మంది పులితోలు కట్టుకుని పెద్ద పులి నృత్యం చేస్తారు. మరి కొంత మంది రంగు రంగుల గుడ్డముక్కలతో నిలువుటంగీ తొడిగి విభూది రేఖలను తీర్చి దిద్దుకుని, లింగ కాయను అందరికీ కనిపించే లాగ మెడలో ధరించి శివరాత్రి పర్వ దినాన నృత్యం చేస్తారు.