పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించిన ...జంగం కథలను చెపుతూ, శవ సంస్కార సందర్భంలో శంఖాన్ని ఊదుతూ, గంట వాయిస్తూ తమ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

బుడిగె స్వరూపం:

జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడిగెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు.

గుమ్మెటకు ఒక వైపున బెత్తపు చట్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండప ప్రక్కన కూజామూతి లాగా, అనాచ్ఛాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కలా వున్న వంత గాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించు కుంటారు. కుడిచేతి వ్రేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండవ ప్రక్క మూస్తూ _గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు.

బుడిగె జంగాల వేష ధారణ:

కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగాచుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజంమీద తంబురాను ధరించి, చేతి వ్రేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు.

కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి వంత పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య్త మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని క్రుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు.

జంగం కథ చెప్పదలచుకున్న గ్రామంలో ముఖ్యమైన చోట్ల గుమ్మెటలను ఉధృతంగా వాయిస్తూ ఫలానా చోట జంగం కథ చెప్పబడుతుందనీ, అందరూ రావాలని చెపుతూ, పాడుతూ వూరంతా తిరుగుతారు.

పగటిపూట ఇంటింటా కథ:

రాత్రిపూట కథలు చెప్పటమే కాక, వీరు పగటిపూట కూడ ఇంటింటికి తిరిగి కథలు చెపుతారు. ఏవిధమైన వర్ణ భేదాన్నీ పాటించక, హరిజన, గిరిజన, తదితర శూద్ర గృహాల ముందు కూడ నిలబడి, జంగం కథలు చెప్పి వారి వద్ద డబ్బుల్నీ,