పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు తగ్గిపోయారు. కళారూపాలు కడుపుకోసం ఆ కళలనే పట్టుకుని దేశసంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్సిస్తూ చాలీచాలని ఆదాయలతో కడుపు నింపు కుంటూ జీవిస్తున్నారు.

ఎందరో నిష్ణాతులైన కళాకారులు ఎందరో కీర్తి శేషులైనారు. ఎన్నో కళా రూపాలు చితికి జీర్ణమై కాలగర్బంలో కలిసిపోయి వాటి స్వరూప స్వభావాలు ఎలా వుంటాయో కూడ తెలియకుండా శిధిలమై పోయాయి. మరికొన్ని జీర్ణమౌతూ శిధిలావస్థలో వున్నాయి. సమిష్టి బృందాలు, సమిష్టి ప్రదర్శనాలు నాశనమై వ్వక్తిగత పాత్రలుగా, చిల్లర వేషాలుగా మిగిలిపోయాయి. ఆ వేషాలతో రైళ్ళలో, గ్రామాల్లో బస్టాండుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నారు.


1976 మార్చిలో హైదరాబాదు జానపద కళోత్సవాలలో సన్మానింప బడిన కళోద్ధారకులు.

ఎడమనుంచి— 1. పరదా ఆదినారయణ 2.గోపాల్ రాజ్ భట్టు 3. డా. బి. రామరాజు 4. డా॥ మిక్కిలినేని 5. శ్రీనివాస చక్రవర్తి 6. డా॥ యశ్వీ జోగారావు 7. యం. వి. రమణమూర్తి.

మరికొంత కాలం ఇలాగే సాగితే ఈనాడు కొనవూపిరితో వున్న ఈ కళా రూపాలు కూడ దక్కవు.

ఒకనాడు జీవిత విధానానికి, విజ్ఞానానికి, వినోద, వికాసాలకు ఆలవాలమైన ఆ కళాసంపదను కాపాడుకోవాలి, వాటిని పునరుద్ధరించాలి.