పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రను రచించాడు. వామన విజయం కథను ఈయన మిత్రులైన పొట్టి పానయ్య, వెంకట సుబ్బయ్యను, వామన విజయాన్ని రచించి, నంబూరు గ్రామంలోని మల్లిఖార్జున స్వామికి అంకిత మియ్యమని కోరారు. అందు మీదట కవి ఈ జంగం కథను రచించాడు.

జంగం కథకులు, బుర్రకథకులు:

పూర్వం జంగం కథలు చెప్పిన వారిలో ప్రముఖులు దొడ్డారపు వెంకట స్వామి, అంజే కోటదాసు, జంగా సుబ్బదాసు, యాదవ దాసు, రెంట పాళ్ళ గుడ్డి జంగం, కోలవెన్ను సమ్మెట రామలింగం, జంగయ్య సుమ్మయ్య దేవర దావులూరు యల్ల మంద, మంతెన జంగాలు మొదలైన ఎందరో మహామహులు జంగం కథకులుగా వర్థిల్లారు. మరెందరో పేర్లు తెలియనంతగా కాల గర్భంలో కలిసిపోయారు.

ఆధునిక బుర్ర కథకులు:

పద్మశ్రీ షేక్ నాజరు, సుంకర సత్యనారాయణ, కోగంటి కాకుమాను సుబ్బారావు, పట్టం శెట్టి ఉమామహేశ్వర రావు, శరివి శేట్టి సుబ్బారావు, డా॥ మిక్కిలినేని, పెరుమాళ్ళు ...మాచినేని, వడ్లపూడి నాగేశ్వరరావు, ఉప్పుగుండూరు కృష్ణమూర్తి ... భీమవరం బాలికలు, చుండ్రు చిన్నాబ్బాయి ... కడప హుసేన్ బాబా, గిద్దలూరు తుపాకుల బసవయ్య, నిట్టల బ్రదర్స్, నలాది భాస్కరరావు, జూనియర్ నాజర్ బెనర్జీ, ప్రసాద్ మోటూరి వుదయం, తుమ్మల కేశవ రావు, గుడివాడ రాఘవులు, కాజబుర్ర కథ దళం నందిగం బ్రదర్సు సబ్బి కనకారావు, కొండేపూడి రాధ, రాఘవరెడ్డి దళం మొదలైన వారంతా ప్రజానాట్య మండలి కళల ద్వారా బుర్ర కథలను చెప్పారు.

పైవారే కాక:

డా: కుమ్మారి మాష్టారు, భద్ర కాళి _ పున్నమరాజు, హనుమంత రాజు, వింజమూరు రామారావు, గొఱ్ఱెల రామలింగం, సైదులు, నదీరా, జయంతి, త్యాగరాజు, బూర్గుల రామమూర్తి, వందన కోటేశ్వర రావు, శిష్టా సాంబశివరావు, రెడ్డి చిన వెంకటరెడడ్డి, కృష్ణమోహన్, తాత నాగేశ్వర రావు, జిల్లెళ్ళమూడి ప్రసాద దళం,