Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుకునే అనేక పేర్లనూ ఆనాటి జంగాల యొక్క ప్రాముఖ్యాన్ని ఇలా వివరించాడు.

రగడ

కోటి సంఖ్యలకు మిగిలిన సంగము లటకు చేరి రపుడు
ఘణం ఘణా యని ఘంటానాదము మింటికి నెగియగను
ధణం ధణా యని తాళనాదములు ధ్వనులట చెలగగను
ధిమి ధిమి ధిమి యని దిమ్మెట లపుడటు సమముగ వాయగను

ఈ విధంగా ఆనాటి జంగాల ఉద్రేకాలను రమణీయంగా వర్ణించాడు. ఈయన కథా రచనలో యక్షగానాన్ని, కందకావర్థ దరువుల్నీ, రగడల్నీ, శృంగార నాటకంగా కథా సరళిని చెపుతానని 14వ పేజీలో చెప్పుకున్నారు.

ఉప్పలపాటి వెంకటరామయ్య:

ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు. ఆరువేల శాఖీయుడు. ఈ కవి అంబరీషోపాఖ్యానం ... జంగం చరిత్ర కథను వ్రాశాడు. రావినూతలపాటి కాపురస్తుడు. వీరగుంట శేషయ్య. ఈ కవిని అంబరీషోపాఖ్యానాన్ని రచించమని కోరగా దీనిని రచించి ఆ వూరి చెన్న కేశవ స్వామికి అంకిత మిచ్చాడు.

ఈ కవి ఇలా వ్రాసుకున్నాడు

రంగుగ తాంబురా చిటి తాళములు ఖణింగున మోయగను
ఛంగు ఛంగున జంగము వారలు ప్పొంగుచు నిక్కథను
చెప్పుట కొర కీ రగడ పద్దతిగ జేసి నిక్కథను.

ఈయన రచన సులభమైన రచనలో సాగింది.

గంధి వెంకటసుబ్బయ్య:

ఈ కవి వైశ్యుడు. గుంటూరు జిల్లా నంబూరు నివాసి. ఈయన వామన విజయం, దేవయాని