పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/329

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లేని రోజుల్లో ఆముదపు దీపాలనూ, నూనె కాగడాలనూ లేదా ఇలాయి కఱ్ఱలనూ విలిగించేవారు. ఈ నాడు పెట్రోమాక్సు లైట్లను వాడుతున్నారు. ముగ్గురు వ్వక్తులుండి, రెండు పెట్రోమాక్సు లైట్లుంటే అతి తేలికగా జంగం కథా కార్య క్రమం జరిగి పోతుందు. కథకునికి ఒక తంబురా, మూడు అందెలు, రెండు కాళ్ళకు గజ్జెలు, వంతకు రెండు గుమ్మెట్లు, ముగ్గురికీ మూడు గౌన్లూ, మూడు తలగుడ్డలూ వుంటేసరి కథ జరిగిపోతుంది. ఒక్కసారి ఈ సామాగ్రిని ఏర్పాటు చేసుకో గలిగితే రోజు వారిగా కావలసిన సామగ్రి ఏమీ వుండదు. ముగ్గురు వ్వక్తులూ వేలాది ప్రజలకు తెల్లవార్లూ

TeluguVariJanapadaKalarupalu.djvu
వుప్పుగుండూరు బుర్రకథ దళం

కథ వినిపించి కూర్చో బెట్టగలరు. వీరు బృందం ఒక గ్రామం నుంచి మరో గ్రామం వెళ్ళాలంటే ఎవరి సామాను వారు భుజాలకు తగిలించుకుని సునాయాసంగా ప్రయాణం చేస్తారు.

కథావిధానం, కథల కట్టు, పట్టు.

జంగం కథల్లో కథకుడు తంబురాను ధరించి శృతిని మీటుకుంటూ చేతి అందెలతో తాళం వేస్తూ కాళ్ళతో నృత్యం చేస్తూ కథను ప్రారంభిస్తాడు. ప్రక్క