పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/328

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జంగం కథను తెలుగు జాతి యొక్క సంగీత జానపద కళారూపంగా చెప్పవచ్చు. ఈ జంగం కథల్లో విద్వత్తును ప్రదర్శించే శ్లోకాలూ, దేశీయ ఛందస్సు అయిన మంజరీ ద్వపదలూ, దరువులూ, కీర్తనలూ, కందార్థాలు మొదలైన వన్ని ప్రవేశ పెట్టబడ్డాయి. ఉదాహరణకు శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి వీర చరిత్ర మంజరీ ద్విపదలో రచించిందే.

పూర్వ కథలు:

ఆంధ్ర దేశపు పల్లెల్లో రైతు కూలీలకు పని లేని తీరిక సమయాల లోనూ, దేవుని వుత్సవాల లోనూ ఈ కథలను చెప్పిస్తుండేవారు. ఈ కథలను చెప్పే జంగాలు పగటి పూట శంఖు, గంటలతో ఇంటింటా వ్వాచకం చేస్తూ, ఈ రాత్రికి నడి బజారులో ఫలానా కథ జంగం కథగా చెపుతున్నామని పలానా వారు చెప్పిస్తున్నారని ఇంటింటా ప్రచారం చేస్తూ, పది లాంతర్లను ప్రోగు చేసి తెల్లవారే వరకూ ఈ కథను చెప్పి వేలాది ప్రజలను ఆనందింప జేసేవారు. ఆనాడు జంగం కథలకు మంచి ఆదరణ వుండేది. ఈ కథకులు ఏ మారు మూల గ్రామంలో కథ చెప్పుకున్న హాయిగా రెండు మూడు బస్తాల ధాన్యం, డబ్బు సంపాదించు కోగలిగేవారు. రాను రాను కుటుంబంలోని సభ్యులందరూ ఈ కథల్లో పాల్గొనేవారు. పురుషుడు కథ చెప్పితే ఆయన భార్వ వంత పాడేది. కొంత మంది ఇద్దరు భార్యలను చేసుకుని జీవన భృతిని తేలికగా సంపాదించు కునేవారు. వృత్తి రీత్యా ఇరువురు భార్యలను చేసుకోవడం తప్పుగా ఎంచేవారు కారు. ఇలాంటి వీరికి ఏవిధమైనా ఆశయమూ వున్నదని చెప్పలేము. ఒకనాడు ప్రబోధం కొరకు ఏర్పాటైన జంగం కథా కళారూపం పారంపర్యంగా జీవనోపాధికి అందితమైంది. ఈ కథలను ముగ్గురు స్త్రీలు కలిపి చెప్పడం కూడ పరిపాటైంది. మూడు స్రీ కంఠాలు కలిపి ఏ బాలనాగమ్మ కథనో చెపుతూ వుంటే పల్లెల్లో కథలు వినే అమ్మలక్కలు కథలో వచ్చే హృదయ విదారక దృశ్యాలకు కండ్ల వెంట నీరు కార్చేవారు. స్త్రీ గొంతులతో చెప్పబడే ఈ కథలు అతి శ్రావ్యంగా వుండేవి.

ప్రదర్శనం, పరికరాలు:

వీరి ప్రదర్శనాలకు రంగస్థలమంటూ ఏమీలేదు. విశాలమైన ఒక వీథిలో పందిరి వేసి చుట్టూ కిరసనాయిలు లాంతర్లు వ్రేలాడ కట్టే వారు. ఈ లాంతర్లు లేని