Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినోదాల విప్ర వినోదులు

ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురు మదురుగా విప్రవినోదం ప్రచారంలో వుందని చెప్పలేం కానీ 1600 __1700 సంవత్సరాలలో ఈ వినోదాలు వ్వాప్తిలో వున్నాయి అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం.

విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయడం వలన విప్రవినోదమని పేరు వచ్చింది. బ్రాహ్మణులలో ఒక తెగ బ్రాహ్మణులు దేవతో పాసన వలననో, మంత్ర తంత్రాల వలనో, ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. అష్టావధానాన్ని కూడ చేస్తూ వుంట్ఘారు. ఆంధ్రదేశంలో ఈ వినోదం చేసేవారు అక్కడక్కడా వున్నారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్రవినోది గోలకొండ సుల్తానుల తుది కాలంలో వున్నట్లు సురవరం ప్రతాప రెడ్డిగారు తెలియజేస్తున్నారు.

చాటువు

సంతత మారగించు నెడ సజ్జన కోటుల
పూజసేయు శ్రీ మంతుడు గుంటుపల్లి
కుల మంత్రి శిఖామణి ముత్త మంత్రి దౌ
బంతియె బంతి గాక కడుపంద గులా
ముల బంతులెల్ల దూల్ బంతులు దుక్కి
టెల్ల యెడ బంతులు విప్రవినోది
గారడీ బంతులు సుమ్ము ధరాతలంబునన్.

అని వర్ణించాడు. ఈ విధంగా ఆ కాలంలో విప్ర వినోదాలు జరుగుతూ వుండేవి. విప్రవినోదం చేసేవారు ఆంధ్ర దేశమంతటా వున్నట్లు మనకు ఆధారా లున్నాయి.