బాలింత వేషం |
మధ్వాచార్యుల వేషం |
- వివిధ పగటి వేషధారులు:
పగటి వేషాలను బహుముఖాలుగా ప్రదర్శించిన వారిలో, గోదావరి మండలంలో పాలంకి నారప్స, రావూరు సూరయ్య, వేముల బాపయ్య, భాగవతుల కోనయ్య, కాలనాథ బట్ట వెంకయ్య, అనకాపల్లి గంగాధరం, విభూతి భవాని లింగం. వీరి ట్రూపు అనేక పగటి వేషాలను ధరించి, ఆంధ్రదేశంలో ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనాల నిచ్చారు. క్రిష్టపాడు జంగాలు నెల్లూరు మూల పేట జంగాలు, కాకినాడ రెడ్లు, నరసరావు పేట ఎర్ర గొల్లలు మొదలైన వారు ఆరాధించారు. ఈ నాటికీ పగటి వేషాల సాహిత్యం కూచిపూడిలో కొల్లలుగా వుంది.
- ప్రజానాట్య మండలి:
ఇటీవల ఆంధ్ర దేశంలో అంధ్రప్రజానాట్య మందలికి సంబంధించిన అనేక దళాలు, ఫకీర్లు, చెంచులు, కోయలు, సుద్దులు, జంతరు పెట్టె, పిట్తలదొర , సోదె మొదలైన వేషాలు ధరించి, తద్వారా రాజకీయ ప్రబోధాన్ని కలిగించారు. సంఘ విద్రోహుల్ని చీల్చి చెండాడే సాహిత్యం ద్వారా, ప్రజా ప్రబోధాన్ని కలిగించారు. ఇలా పగటి వేషాలను ధరించిన వారిలో కోగంటి గోపాల కృష్ణయ్య _కోసూరి మాచినేని డా॥ మిక్కిలి నేని, డా॥ రాజారామ _ నాజరు, రామ కోటి మొదలైనవారు ముఖ్యులు.