పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సోమయాజులు ఇలా ప్రవేశిస్తాడు, మహా ప్రభో మేము అయితాగ్నులం, పరాన్న ప్రియులం, శ్రోత్రియులం, ముమ్మారూ వెళ్ళి మూడు కావెళ్ళు తెచ్చినాము. కాశీ గంగ కావెళ్ళు... చెయ్యా చేయించా గల సమర్థులం. ఏమిటంటే యజ్ఞ యాగాది క్రతువులు, వివాహ ఉపనయనములూనూ నాయనా... మా సోమిదేవి అక్కడ వుందా లేదా? వాసే సోమీ, వాసే సోమీ, వాసే సోమీ... అని పిలుస్తాడు.

సోమిదేవి: సోమి సోమీ అన్న నోటికి విధి విరామం లేదుకదా? ఆ నోరు ఎన్నడైనా పచ్చి వెలక్కాయ చిప్పల్లాగా నొక్కుకు పోతే సుఖ పడుదును.

సోమ: ఏమిష్రా నాయనా! అంచోంది.

శిష్యుడు: తాతగారూ మిమ్ముల్ని తిడుతోదండి.

సోమ: ఒరే శిష్యా మిమ్మల్ని తిడితే నాతో చెపుతారేంరా దౌర్బాగ్యుల్లారా!

TeluguVariJanapadaKalarupalu.djvu
గొల్లపడుచు, బ్రాహ్మణుడు సంవాదం

శిష్యు: నిన్ను తిడుతోంది.

సోమ: నిన్న తిడితే ఇవ్వాళ చెపుతారేంరా!

శిష్యు: కాదండీ తాతగారూ. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు గనుక మిమ్మల్నే తిడుతుందండీ.

సోమ: నన్నే తిడుతోందీ. ఆసే సోమీ నన్నే తిడుతున్నావటే?

సోమి: ఇదుగో ఏమో విన్నారు కాదుకదా? నేను మాట్టాడితేనే మీకు తిట్టు.

సోమ: తిడితే తిట్టు అవుతుంది గాని, మాటలంటే తిట్టు ఎలా అవుతుంది? సరే నీవు తిట్టినా నాకు సమాధానమే.