వేషాలు ధరిస్తే వీరయ్య గారు సత్వగుణ ప్రధానమైనవి, తామస గుణ ప్రధాన మైనవీ రెంటినీ ప్రదర్శించే వారు. తామస గుణానికీ చెందినవే వారి శక్తి వేషమూ, బేతాళుని వేషమూ.
- సున్నపు వారి శక్తి వేషం:
వీరయ్యగారు ప్రదర్శించే ఇతర వేషాలన్నిటికీ ప్రేక్షకులు మూగే వారు. కానీ, ఈ శక్తివేష ప్రదర్శనం నాడు గ్రామంలో వున్న అనేక మంది పొలాలకు వెళ్ళి పోయేవారు. ఇక గ్రామంలో కొద్ది మంది తలుపులు బిగించుకుని ఇళ్ళలో వుండేవారు. వీరయ్యగారి శక్తి వేషం సరిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మండుటెండలో తప్పెట్ల వాయిద్యంతో బయలుదేరేది. వేషధారణ అతి భయంకరంగా వుండేది. కన్నులకు కోడి గ్రుడ్లు, ముఖానికి నల్ల రంగు, పెద్ద పెద్ద కోరలు, నల్లని దుస్తులు విరబోసిన జుట్టు, చేతిలో శూలం, నోటినుండి కారే రక్తంతో మహా బీభత్సంగా వుండేది ఆయన శక్తి వేషం.
- అట్టహాసంగా అద్భుత ప్రదర్శన:
ఆయనను బండిమీద ఎక్కించేవారు. తప్పెట్ల నృత్యంతో వూరేగింపు సాగేది. ఈ లోగా గ్రామాంలోని వీథులన్ని నిర్మానుష్యం. పిల్లల్నీ ఎవర్నీ ఈ దృశ్యం చూడనిచ్చేవారు కారు. పెద్దలు మాత్రం తలుపు కంతల్లోంచీ, దూరంగా వుండేవాళ్ళు. ఈ విధంగా అంతమయ్యేది ఆయన శక్తి వేష ప్రదర్శనం. ప్రదర్శనాలన్నీ వరుసగా ఒక నెల రోజులు రోజు కొక వేషం చొప్పున, ప్రదర్శించిన తరువాత వీరయ్యగారు ఈ శక్తి వేష ప్రదర్శనాన్ని, బేతాళుడి వేషాన్నీ దేవర పెట్టె వేషాన్నీ ధరించేవారు.
- భీతావహమైన బేతాళుని పాత్ర:
వీరయ్యగారి బేతాళుని పాత్ర ధోరణిలో రెండు చేతులకూ రెండు బలమైన తాళ్ళు గట్టి వెనుక కొంత మంది లాగి పట్టుకునేవారు. వీరయ్యగారు బుగ్గకు కత్తి పొడుచు కునేవారు. నోటి నుండి రక్తం రొమ్ము మీదికి కారుతూ వుండేది. ఒక్క