పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిక యాసలనూ, మాండలిక పదాలను గట్టిగా వంట బట్టించుకున్నారు. ఆ వేషధారులు ఆంధ్రదేశంలో అన్ని ప్రాత్రల మాండలిక వ్వవహారిక యాసలనూ ఆశువుగా బట్టీపట్టి నట్లు బయట పెట్ట గలరు.

కూచిపూడి పగటి వేషాలు:

కూచిపూడి కళాకారులు వీథి భాగవతాలలో ఎంతటి ప్రసిద్ధులో పగటి వేషాలలో కూడ అంతటి ప్రసిద్ధులే. ఈ పగటి వేషాలను కూచిపూడివారు ప్రారంభం నుండే వీటిని ధరించ లేదు. వారి వీధి భాగవతాలకూ యక్షగానాలకూ కొంత ప్రచారం తగ్గిపోయిన తరువాత భాగవతులలో చీలిక వచ్చి ఎవరికి వారై ఏదో రకంగా ఉదర పోషణార్థం ఈ పగటి వేషాలను ప్రారంభించారు.

ఆనాడు కొన్ని యక్షగాన ప్రదర్శనాల్లోనూ, వీథి భాగవత ప్రదర్శనాల లోనూ మధ్య మధ్య వచ్చే కొద్ది కొద్ది విరామ సమయాలలో ప్రేక్షకుల వినోదం కొరకు పంతుల వేషం, పఠాను వేషం, రెడ్డి వేషం, త్రాగు బోతు వేషం మొదలైన వాటిని ప్రదర్శించేవారు. పగటిపూట అంటే తెల్లవార్లూ ప్రదర్శనం ముగిసిన తరువాత ఆట ముగించి, అదే వేషాలతో ఇంటింటికి యాచనకు బయలు దేరేవారు. వెంటనే బయలు దేరడానికి కూడ కారణం లేక పోలేదు. తెల్లవార్లూ ప్రదర్శనం చూచిన ప్రేక్షకులు ముగ్ధులై ఇంకా ఆనందంలో వారుండగానే వారి నుంచి ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టేవారు. అలా ప్రారంభించబడిన పగటి వేషాలే అలా అలా అల్లుకు పోయి కళాఖండాలుగా ప్రచారం పొందాయి.

సహజ పాత్రలూ, సజీవ భాషా:

వీరు కూడ అనేక వేషాలు ధరించేవారు. కోమటిసెట్టి పాత్ర ధరిస్తే వైశ్యుల భాష, యాస, మాట తీరు, బొంగురు గొంతు, యుక్తి మాటలు, సునిశిత హాస్యం, వ్వాపార చమత్కారం, ఇతరులకు నొప్పిగలుగని అతిలౌకికమైన నటనా అచ్చు గుద్దినట్లు ఒప్పించేవారు.

గారకీ వేషంలో ఇంద్రజాల మహేంద్ర జాలాన్ని అద్భుతంగా ప్రదర్శించే వారు. బట్టల నేత, బట్టల అమ్మకం, కోడి పోరులో పందెం గాళ్ళ జోరు, వారి వికటాట్టహాసాలు, బైరాగి వేషాలతో ప్రజలను మోసపుచ్చే దొంగ సన్యాసుల