పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశంలో పగటి వేషాలకు భిక్ష పెట్టినవారు గడ్డిపాడు పగటి వేషధారులే. ఆ గ్రామంలో అందరూ పగటి వేషాలు వేయగల సమర్థులుగా వుండేవారు. వారు దాదాపు అరవై రకాల చిత్ర విచిత్ర మైన పగటి వేషాలను ధరించే వారు. ఆ పగటి వేషాలతో నిత్య జీవితానికి సంబందించినవి కొన్ని, హాస్య రసంతో కూడుకొన్నది కొన్ని మరికొన్ని పౌరాణిక వేషాలు, కల్పనా వేషాలూ, కొన్ని కేవలం హాస్య రసంతో కూడుకున్నవి. మొత్తంమీద సంఘంలో వుండే అన్ని జాతీయ పాత్రలూ వీరి వేషాల్లో మూర్తీభవించి వుండేది.

వేషగాండ్ల ప్రతిభ:

వేషం ఊరికే ధరించడం కాక తద్రూపంగానే నమ్మించేవారు. గొఱ్ఱెలు కాచే గొల్లల పాత్రలు ధరించి, సుద్దులు చెపితే అక్షరాలా గొఱ్ఱెల కాపరులను గుర్తుకు తెచ్చేవారు. వేషం వెయ్య వచ్చును కాని దానిని నమ్మించడం ఎలా? అదే గడ్డిపాడు పగటి వేషధారుల్లో వున్న ప్రత్యేకత. తెలుగు దేశంలో వర్గాలూ, కులాలూ, జాతులు వున్నాయో ఆయా జాతులకు సంబంధించిన అన్ని భాషలనూ ఆకళింపు చేసుకుని వారు ధరించే ప్రతి పాత్రకూ సాహిత్యాన్ని కల్పించి స్వతంత్రం చేసుకునే వారు. అన్ని మనస్తత్వాలనూ, ఆటనూ, పాటనూ, మాటనూ, వుచ్చారణనూ, వేషధారణనూ, ఒంపులూ వయ్యారాలనూ విధిగా ఒక విద్యగా అభ్యసించేవారు. అందు వల్లనే వారు పగటి వేషాల్లో ప్రఖ్యాతి వహించారు. పగటి వేషధారులు అంటే గడ్డిపాటి వారే ననీ, ఆ ప్రతిభకు వారే అర్హులనీ తేలి పోతుంది.

కృత్రిమ అలంకారాలు లేని సహజ కళ:

ప్రయోగాత్మకమైన కళారూపాలలో నాటకం వుత్తమమైంది. అలాగే జానపద కళారూపాలలో పగటి వేషధారణ కూడ వుత్తమమైంది. ఈ పగటి వేష ప్రయోగంలో చతుర్విధ అభినయాలూ ప్రాముఖ్యం వహిస్తున్నాయి. రంగస్థల పరికరాలూ, రంగ ప్రదీపనం మొదలైన కృత్రిమ అలంకారా లేవీ లేకుండా ప్రజలను రంజింప చేసే పగటి కళారూప మిది.

పగటి వేషధారులు ఆంధ్ర దేశం నాలుగు చరగులా పర్యటించి ఆయా ప్రాంతాలలో వున్న మాండలిక వ్వవ