పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కూచిపూడి నృత్యంలో రాజసులోచనకు ప్రత్యేక స్థానముంది. సినీ నటిగా, నర్తకిగా ఆమె ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, శిక్షణనిచ్చి కూచిపూడి నృత్యానికి మంచి పేరు తీసుకువచ్చింది.

అలాగే రత్నపాప పతివాడ రాధిక, కనక దుర్గ, ఉమాభారతి, అన్నపూర్ణ, సుమతీ కౌశల్, శోభానాయుడు, యడవల్లి రమ, చంద్రకళ, కళ్యాణి, మంజుభార్గవి మొదలైన ఎంతో మంది కూచిపూడి నృత్యకళకి ప్రాణం పోశారు. మరెందరి పేర్లో ఉదహరించలేక పోయి నందుకు విచారిస్తున్నాను. కావాలని ఎవరినీ విస్మరించ లేదు. ప్రతిభావంతులు మరుగున పడి వుండవచ్చును.

TeluguVariJanapadaKalarupalu.djvu
రాజసులోచన

ఈ నాడు రాష్ట్ర వ్వాప్తంగా ఎంతో మంది కూచి పూడి నృత్య విద్యాలయాలను స్థాపించి శిక్షణ ఇస్తున్నారు. కాని ఈ శిక్షఃణాలయాలను ప్రతిభావంతులు కాని వారు కూడా నడుపుతూ

TeluguVariJanapadaKalarupalu.djvu

కూచిపూడి నృత్య కళకు అపకీర్తి తెస్తున్నారు. ఏది ఏమైనా కూచి పూడి నృత్యంతో పాటు వారి యక్షగాన కళనూ, వీథినాటకాలనూ, పగటివేషాలనూ సంప్రదాయ పద్దతిలో రక్షించడం ఎంతైనా అవసరం.