పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శాస్త్రిగారి విద్యను దర్శించిన ఉత్తరాది ఉజ్వల నటుడు ఉదయశంకర్ ఉండ బట్టలేక ఈయనకు అమాంతంగా సాష్టాంగమే పడ్డాడు.

శాస్త్రిగారి జీవితం అంతా రాజుల ఆస్థానాల్లోనే గడిచింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం భావనగర్ మహారాజా గవర్నరు గిరీకింద శ్రీ పి.వి.రాజమన్నారు సమక్షంలో ప్రముఖ కళాకారులుగా శాస్త్రిగారిని గుర్తించి సువర్ణ ఘంటాకంకణాలతో సత్కరించింది.

ఎందరో శిష్యులు:
TeluguVariJanapadaKalarupalu.djvu
వెంపటి చినసత్యం

శాస్త్రిగారి దగ్గిర భామాకలాపం, గొల్ల కలాపం, నేర్చుకున్న శిష్యులు అసంఖ్యాకం. ఈ నాడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా కీర్తి సంపాదిందిన వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యం, వెంపటి చినసత్యం, మొదలైన వారు శాస్త్రి గారి శిష్యులే. మద్రాసు లోని సుప్రసిద్ధ నాట్యాచార్యుడు శ్రీ రామయ్యపిళ్ళె స్వయంగా కొన్ని నాట్య రీతులు శాస్త్రిగారి వద్ద అభ్యసించారు.

రామయణం, మండూకశబ్దం, ప్రహ్లాద పట్టాభి షేకం, తాటకి సంహారం, దశావతారాలు మొదలైన వాటిని శబ్ద రూపంలో శ్రీ శాస్త్రిగారు నృత్యం చేసే వారు.